బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై వైమానిక దాడికి పాల్పడి ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులెమాన్ ను హతమార్చి 24 గంటలు కూడా కాకముందే మరోమారు అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ పై వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాన్ మద్దతున్న పారామిలిటరీ బలగాల కాన్వాయ్ పై తెల్లవారుజామున దాడులకు పాల్పడింది. ‘హబీబ్ అల్ షాబీ’ కమాండర్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాగ్దాద్ సమీపంలోని తాజీ స్టేడియం వద్ద జరిగిన ఈ వైమానిక దాడులకు ఇప్పటివరకు ఎవరు బాధ్యత వహించలేదు.
కాగా తాజీ స్టేడియం వద్ద దాడులకు తాము పాల్పడలేదని అమెరికా అధికారి తెలిపారు. ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని కానీ.. ఉత్తర బాగ్దాద్ ప్రాంతంలోని తాజీ స్టేడియం వద్ద జరిగిన దాడులకు తమకు సంబంధం లేదని అన్నారు. గత కొంతకాలంగా క్యాంప్ తాజీ వద్ద తాము ఎలాంటి వైమానిక దాడులకు పాల్పడలేదని అమెరికాకు చెందిన అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కోన్నారు. కాగా, తాజీ క్యాంపు వద్ద వైద్యులను తీసుకుని వెళ్తున్న మూడు వాహనాల్లో రెండు వాహనాలను ధగ్ధమయ్యాయని ఐరాన్ వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇరాన్ ఉన్నత స్థాయి కమాండర్ జనరల్ ఖాసిం సులేమానీపై శుక్రవారం జరిపిన దాడిలో హషీద్ అల్ షాబీ డిప్యూటీ కమాండర్ అబు మహదీ అల్ ముహందిస్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే దళానికి చెందిన కమాండర్ ను లక్ష్యంగా చేసుకొని తాజా దాడి జరిగినా.. ఇరాన్ టీవీ మాత్రం సీనియర్ వైద్యులతో వెళ్తున్న వాహనాలపై దాడి జరిగినట్లు పేర్కోంది.
మరోవైపు శుక్రవారం నాటి దాడుల్లో మరణించిన ‘ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండోలు, ‘హషీద్ అల్ షాబీ’ దళ సభ్యులకు ఇరాక్ లోని ఇరాన్ మద్దతుదారులు నేడు సంతాపయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం మృతదేహాల్ని ఇరాన్‌కు అప్పగించనున్నారు. దాడి తరవాత పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు నెలకొన్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more