Oil prices jump after killing of Suleimani సోలేమాన్ మరణంతో ఇంధన ధరలకు రెక్కలు

Iran crisis us embassy tells its citizens to leave iraq immediately

Iran, Donald Trump, Qassem Suleiman, Abu Mahdi al-Muhandis, missile attack, americans, iraq, Middle East and North Africa, US news, World news

Iraq’s military has condemned the killing of Abu Mahdi al-Muhandis, the Iraqi paramilitary leader who died alongside Qassem Suleiman, Iran’s top general. The Iraqi military said it was a clear breach of the US mandate in Iraq, according to a report by Reuters.

‘ఇరాక్ వదలి వచ్చేయండీ..’ అమెరికావాసులకు పిలుపు

Posted: 01/03/2020 04:43 PM IST
Iran crisis us embassy tells its citizens to leave iraq immediately

బాగ్దాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై జరిగిన దాడికి తామే బాధ్యులమని అగ్రరాజ్యం అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ ధ్రువీకరించింది. తమ దేశాధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అదేశాలతోనే తాము ఈ చర్యలకు పాల్పడినట్టు తెలిపింది. అమెరికావాసులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్ ను చంపాలన్న అధ్యక్షుడి ఆదేశాల మేరకే ఈ దాడి జరిపినట్లు వెల్లడించింది. అమెరికా వైమానిక దళాలలకు చెందిన హెలికాప్టర్లే ఈ దాడికి చేశాయని పేర్కొంది. దాడి జరిగిన కొద్దిసేపటికే ట్రంప్‌ అమెరికా జాతీయ జెండాను ట్విటర్‌లో ఉంచడం గమనార్హం.

ఇరాక్ లో ఉన్న తమ బలగాల్ని రక్షించుకునేందుకు ఖాసీంని చంపాలని ట్రంప్ ఆదేశించినట్లు పెంటగాన్‌ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకే అమెరికా సైనిక వర్గాలు స్వీయ రక్షణలో భాగంగా దాడి చేయాల్సి వచ్చిందని తెలిపింది. భవిష్యత్తులో ఇరాన్‌ చేయాలనుకుంటున్న మరిన్ని దాడుల్ని నిరోధించాలనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరుల్ని రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని పేర్కొంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు దాదాపు నాలుగు శాతం మేర పెరిగాయి.

తాజా దాడిలో ఇరాక్‌ తిరుగుబాటు సంస్థ పీఎంఎఫ్‌ డిప్యూటీ కమాండర్‌ అబు మహదీ అల్‌-ముహందిస్ సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్‌నకు చెందిన పలువురిని అమెరికా బలగాలు బాగ్దాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల ఇరాక్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్‌ మద్దతున్న నిరసనకారులు దాడి జరిపి.. అమెరికా బలగాలతో తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. దీనిపై స్పందించిన అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌.. అమెరికావాసులపై జరిపిన దాడికి ప్రతీకార చర్య ఉంటుందని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజా దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌లో కీలక నిఘా విభాగం అయిన ఖడ్స్‌ ఫోర్స్‌కి మేజర్‌ జనరల్‌ ఖాసీం సోలెమన్‌ మరణించిన నేపథ్యంలో అమెరికా తమ దేశపౌరులను అప్రమత్తం చేసింది. ఇరాక్ లో వున్న తమ దేశస్థులు తక్షణం ఆ దేశాన్ని వీడి రావాలని అదేశాలు జారీచేసింది. ఇరాన్, ఇరాక్ దేశాలలో నెలకొన్న తాజా వాతావరణ నేపథ్యంలో ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశాలు వుంటాయన్న అనుమానంలో అగ్రరాజ్యం ఈ పిలుపునిచ్చింది. ఇక అదే సమయంలో అటు అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన రంగం షేర్లు లాభాన్ని అర్జిస్తున్నాయి. సోలేమన్ మరణంతో ఏకంగా మూడు నుంచి నాలుగు శాతం మేర ఇంధన ధరలు పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iran  Donald Trump  Qassem Suleiman  Abu Mahdi al-Muhandis  missile attack  americans  iraq  World news  

Other Articles