All set for Vaikunta Ekadasi at Tirumala తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఘనంగా ఏర్పాట్లు

All set for vaikunta ekadasi dwadasi dwara darshanam at tirumala ttd eo

Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, Vaikunta dwaram, Vaikunta Ekadasi, Mukkoti Ekadasi, Uttara dwara darshanam, devotional

All arrangements are in place for Vaikunta Ekadasi and Vaikuntha Dwadasi Dwara darshan in Srivari temple at Tirumala, said TTD Executive Officer Anil Kumar Singhal.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఘనంగా ఏర్పాట్లు..

Posted: 01/03/2020 03:58 PM IST
All set for vaikunta ekadasi dwadasi dwara darshanam at tirumala ttd eo

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠానికి వెళ్లే ద్వారం వైకుంఠ ద్వారం. దీన్ని ఉత్తర ద్వారమని కూడా భక్తులు పిలుస్తుంటారు. పుష్యమీ మాసంలో వచ్చే శుద్ద ఏకాదశిని భక్తులు వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ పర్వదినాన అన్ని వైష్ణవాలయాల్లో సాధారణంగా భక్తులు దర్శనానికి వెళ్లే తూర్పు ద్వారాల గుండా కాకుండా భక్తులను ఉత్తర ద్వారాల నుంచి దర్శనానికి పంపిస్తుంటారు. ఉత్తర ద్వారాల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తులు పోటీపడుతుంటారు.

అయితే ద్వాదశిన కేవలం ఫుణ్యక్షేత్రాల్లో మాత్రమే.. అదీనూ భక్తుల రద్దీని దృష్ట్యా మాత్రమే అనుమతిస్తారు. అప్పుడు మినహా సంవత్సరంలో మరెప్పుడూ ఆ ద్వారా దర్శనం అందుబాటులో వుండదు. ఈ ఏడాది జనవరి 6వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షా ఎనభై వేల మంది భక్తుల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఈ మేరకు టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని లక్షా 70 వేల రూపాయల ఖర్చుతో అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు.

ఇల వైకుంఠంలో వెలసిన కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుడి దర్శనం ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు కూడా తమవంతు సహకారం అందించాలని సింఘాల్ విజ్ఞప్తి చేశారు. నారాయణ గిరి ఉద్యానవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ ను ఐదో తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ నెల 21, 28 తేదీల్లో దివ్యాంగులకు, 22, 29 తేదీల్లో చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు సింఘాల్ తెలిపారు.

అయితే గతేడాది పది రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం కల్పించనున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చుతూ కేవలం రెండు రోజులకే ఉత్తరద్వార దర్శనాన్ని పరిమితం చేయడంపై భక్తుల్లో సందిగ్ధత నెలకొందని హైకోర్టులో న్యాయవాది తాళ్లపాక రాఘవన్ వేసిన వాజ్యం విచారణకు కూడా వచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకె మహేశ్వరి, జస్టిస్ ఎం వెంకటరమనాలతో కూడా ద్విసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించిన న్యాయవాది రాఘవన్.. పలు వైష్ణవాలయాల్లో పది రోజుల పాటు ఉత్తరద్వార దర్శనానికి అనుమతిస్తారని వాదనలు వినిపించారు.

కాగా, తిరుమలలో కేవలం రెండు రోజులకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, పది రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం కల్పించాలని ఇప్పటికే ఆగమశాస్త్ర పండితుల నుంచి కూడా సూచనలు వచ్చాయని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్.. ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి టీటీడికి ఆగమ పండితుల నుంచి ఎలాంటి సూచనలు అందలేదని తెలిపారు. అయితే ఆగమ పండితుల సూచనలు వచ్చిన క్రమంలో వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles