Booklets on Savarkar-Godse Homosex spark controversyసావర్కర్ ప్రతిష్టకు భంగం కలిగించే కుట్రరంజిత్

Savarkar s grandson seeks ban on controversial booklet

All India Congress Seva Dal, ranjit savarkar, Nathuram Godse, Hindu Mahasabha, RSS, Vinayak Damodar Savarkar, Veer Savarkar, Savarkar Godse relationship, Madhya Pradesh, politics

Grandson of Vinayak Damodar Savarkar on Friday urged the Madhya Pradesh government to ban the Congress booklet which claims that the Hindu Mahasabha co-founder had a "physical relationship" with Mahatma Gandhi's assassin Nathuram Godse.

కాంగ్రెస్ సేవాదళ్ బుక్ లెట్ నిషేధించి.. కేసు పెట్టాలి: రంజిత్

Posted: 01/03/2020 02:10 PM IST
Savarkar s grandson seeks ban on controversial booklet

'వీర సావర్కర్ కిత్నే వీర్?' పేరుతో కాంగ్రెస్ సేవాదళ్ తీసుకువచ్చిన బుక్‌లెట్‌ను నిషేధించాలని వినాయక్ దామోదర్ సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. భోపాల్‌లో జరుగుతున్న పదిరోజుల శిక్షణా శిబిరంలో ఈ బుక్ లెట్ ను పంచిన కాంగ్రెస్‌ సేవాదళ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే, వీర సావర్కర్‌ మధ్య 'శారీరక సంబంధం' ఉందంటూ ఆ బుక్ లెట్ లో ఓ కథనాన్ని ప్రచురించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
 
హిందూ మహాసభ సహ-వ్యవస్థాపకుడైన వినాయక్ దామోదర్ సావర్కర్ కు గాంధీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేతో 'శారీరక సంబంధం' ఉందని.. గాడ్సే బ్రహ్మచర్యం తీసుకునే ముందు ఆయన తన రాజకీయ గురువైన సావర్కర్ తో శారీరక సంబంధాలు కలిగివున్నారని ఆ బుక్ లెట్‌ తెలిపింది. లారీ కొల్లిన్స్, డొమినిక్ లపైరే రాసిన 'ఫ్రీడం ఎట్ మిడ్ నైట్' పుస్తకంలోని 423వ పేజీని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను సేవాదళ్ చీఫ్ లాల్జీ దేశాయ్ సమర్ధిస్తూ, సాక్ష్యాల ఆధారంగానే రచయిత ఈ రచన చేశాడని చెప్పుకోచ్చారు. సావర్కర్ 'గే' అవునా కాదా అనేది తమకు ప్రధానం కాదని కూడా పేర్కోన్నారు.

అయితే తమకు నచ్చిన విధంగా వ్యహరించే లీగల్ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. బీజేపీ హీరోలుగా అభివర్ణించిన వ్యక్తుల నిజస్వరూపం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిపై సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ ఒక పత్రికా ప్రకటనలో మండిపడ్డారు. 'సావర్కర్‌ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. అనుచిత ఆరోపణలతో దేశంలో అరాచకవాదాన్ని ఆ పార్టీ వ్యాప్తి చేస్తోంది. కాంగ్రెస్ సేవాదళ్‌పై ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి' అని అన్నారు. ఐపీసీలోని సెక్షన్ 120, 500, 503, 504, 505, 506 కింద కేసులు నమోదు చేయాలని, ఆ బుక్ లెట్ పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలని రంజిత్ సావర్కర్ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles