Amaravati farmers state protest for 12th day అమరావతి రైతుల అందోళనలు.. మందడంలో వంటావార్పు

Mandadam farmers protest demanding amaravati as single capital

YS Jagan, Amaravati, Amaravati Bandh, !44 Section, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Andhra Pradesh, Politics

On Monday the agitation by farmers in the capital region continued for 13th day. Relay fasting program continued in Tulluru and Velagapudi. In the early morning, the farmers, the farm labourers and the women are taking to the road and participating in Deeksha camps.

అమరావతి రైతుల అందోళనలు.. మందడంలో వంటావార్పు

Posted: 12/30/2019 12:21 PM IST
Mandadam farmers protest demanding amaravati as single capital

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్ క్యాపిటల్ గా అవరావతిని కాకుండా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన జగన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రజలు గత పదమూడు రోజులుగా నిరసనలు అందోళనలు చేస్తూనేవున్నారు. సీడ్ క్యాపిటల్ గా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ తో ఇవాళ కూడా అమరావతి రైతుల నిరసన కొనసాగుతోంది. మూడు రాజధానుల నిర్ణయంపై చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ ఎవరి కోసమని రైతులు ప్రశ్నించారు.

తమ నిరసన కార్యక్రమాల్లో భాగంగా అమరావతిలోని సచివాలయానికి వెళ్లే మార్గంలో మందడం రైతులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. మందడం గ్రామ రైతులకు పరిసర ప్రాంతాల రైతుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. మందడం గ్రామ రైతులు మార్గాన్ని దిగ్బంధం చేయడంతో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. అమరావతికి వెళ్లే మార్గంలో పికెట్ ఏర్పాటు చేసిన పోలీసులు ఆ మార్గంలో కేవలం గుర్తింపు కార్డు వున్న వారిని మాత్రమే ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు.

ఇక మరోవైపు తుళ్లూరులోనూ రైతులు నిరసనలు కొనసాగుతున్నాయి. మహాధర్నా ప్రాంగణం వద్ద రాజ్యంగా నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేదర్, ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటాలతో రైతులు ధర్నాలో కూర్చున్నారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. తమ ఉద్యమాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్న కొందరు మంత్రుల తీరును తప్పుబట్టారు. రాజధాని కోసం ఐధేళ్ల క్రితం తమ భూములను ఇస్తున్నప్పుడు ప్రతిపక్షంలో వున్న ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కమాట కూడా మాట్లాడకుండా.. తమకు సమతమని చెప్పి ఇప్పుడు తమ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles