TRS MLA Shankar Nayak Walks Barefoot On Red Fire అగ్నిగుండంలో నడిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.!

Trs mla walks barefoot on red fire during ayyappa swamy pandal pooja

Shankar Nayak, TRS MLA, Mankota MLA, Mahabubabad, Walked on Red Fire, Ayyappa Mandal puja, CM KCR, Telangana, Politics

TRS MLA Shankar Nayak walked barefoot on red fire on the occasion of the last day of Ayyappa Mandalam Pooja. He told that he is very happy to walk on the fire. He added that Telangana Chief Minister K Chandrasekhar is performing pujas for the well being of the state.

ITEMVIDEOS: అయ్యప్ప మండలపూజలో అగ్నిగుండంలో నడిచిన ఎమ్మెల్యే.!

Posted: 12/28/2019 02:56 PM IST
Trs mla walks barefoot on red fire during ayyappa swamy pandal pooja

వృత్తులను బట్టి కులాల విభజన జరిగిందని, అంతేకానీ.. కులాలను బట్టి అగ్రవర్ణాలు, అణిచివేయబడిన వర్గాలు అంటూ గణన జరగలేదని ఎన్నో ఏళ్లుగా రాజకీయ నేతలు చెబుతున్న మాటలనే ఆయన చెప్పారు. కానీ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మనుషుల పేర్లకు తోకలు తగలడంతోనే పెద్ద అని భావిస్తున్నారని, అవే మనుషులకు బలుపును అందిస్తున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఇంతకీ ఆయనెవరో తెలుసా.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్.

తన నియోజకవర్గ పరిధిలోని మానకోటలో జరిగిన అయ్యప్పస్వామి మండల పూజలో పాల్గోన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ చండీహోమాలు, సుదర్శన యాగాలు ఇత్యాధి అధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారని, ఆయన బాటలోనే తాను మానుకోటలో గత 24 ఏళ్లుగా.. అయప్పస్వామి మండల పూజలో పాల్గొంటున్నట్లు చెప్పుకోచ్చారు. తన నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో వుండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ తాను నిప్పులు గుండంలో నడిచానని చెప్పారు.

అయ్యప్ప మాల ధరించిన మండల పూజ సందర్భంగా నిప్పుల గుండంలో నడిచి ఔరా అనిపించారు. అయ్యప్ప మాల ధరించి ఉన్నందున ఆయన కూడా అందరు అయ్యప్ప భక్తుల మాదిరిగానే నిప్పుల్లో నడిచానన్నారు. తాను తప్పు మాట్లాడలేదని అందుకే నిప్పుల గుండంలో నడిచినా ఏం కాలేదని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యను కావాలని వక్రీకరించారని అది వారి విజ్ఞతకే వదిలేస్తానన్నారు. అయితే ఎమ్మెల్యే నిప్పుల్లో నడిచిన వార్త జిల్లాలోనే కాక తెలంగాణ అంతటా హాట్ టాపిక్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles