BMC, TMC set to transfer accounts from Axis Bank అమృత ఫడ్నావిస్ కు షాక్.. టీఎంసీ, బీఎంసీ అకౌంట్లు ట్రాన్స్ ఫర్

Shift accounts of thane municipal corporation to national banks

BJP, Amruta Fadnavis, Axis Bank, TMC, BMC, Bank Accounts, National Bank, Shiv Sena, Uddhav Thackeray, Sharad Pawar, devendra fadnavis, Thane Municipal Corporation (TMC), thane mayor naresh mhaske, shiv sena, Mumbai mayor Kishori Pednekar, MLA Aaditya Thackeray, Devendra Fadnavis, chief minister uddhav thackeray, axis bank, Shiv Sena-NCP-Congress alliance, Maharashtra, Politics

Thane Mayor Naresh Mhaske directed the officials of the Shiv Sena-led Thane Municipal Corporation to shift their salary accounts from Axis Bank to a nationalised bank. Mumbai Mayor Kishori Pednekar has also hinted that the BMC may soon be moving the salary accounts of its employees, including those of some fire brigade officials, from the bank.

అమృత ఫడ్నావిస్ కు షాక్.. టీఎంసీ, బీఎంసీ అకౌంట్లు ట్రాన్స్ ఫర్

Posted: 12/28/2019 01:26 PM IST
Shift accounts of thane municipal corporation to national banks

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి, బీజేపి నేత దేవేంద్ర ఫడ్నావిస్ సతీమణి అమృత ఫడ్నావిస్ కు షాక్ ఇవ్వనుంది. రాజు తలచుకుంటే దెబ్బలు కొదవా.? అన్న చందాన్ని గత ఐదేళ్లుగా బాగా వంటపట్టించుకున్నా.. ఇంకా తమదే అధికారమన్న భ్రమల నుంచి బయటపడినట్టు లేదు అమె. అందుకనే అమె తనకు సంబంధం లేని రాజకీయాలలో తలదూర్చి.. ఉద్యోగానికి ఎసరు తెచ్చుకుంటున్నారా.? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

తమ భర్త అధికారంలో వుండగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ఆయన ప్రభుత్వ తీరును చాలా దగ్గరగా చూసిన ఆమె.. తాజాగా మహారాష్ట్రలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా అదే పంథాన నడుస్తుందన్న విషయాన్ని తెలుసుకోకపోవడం కొసమెరుపు. తన భర్త దేవేంద్ర ఫడ్నావిస్ ట్విట్టర్ లో పోస్టు చేసిన కామెంటును చూసి అయనకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అమె.. రాజకీయంగా వివాదాన్ని అనవసరంగా తన తలనెక్కించుకున్నారు.

తాను పనిచేస్తున్న యాక్సిస్ బ్యాంకుకు నష్టం కలిగే చర్యలకు బాధ్యురాలిగా మారారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకు నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. తాజాగా, ఈ జీతాలను యాక్సిస్ బ్యాంకు నుంచి జాతీయ బ్యాంకులకు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ)మేయర్ నరేశ్ మాస్కే ప్రకటించడంతో పాటు థానే మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు కూడా అదేశాలు జారీ చేశారు. ఇక తాజాగా టీఎంసీ బాటలోనే బిఎంసీ కూడా పయనించనుంది.

ప్రైవేటు బ్యాంకులలో అధిక వడ్డీ లాభం చూసుకోవడం కన్నా.. జాతీయ బ్యాంకుల్లో కార్మికులు, ఉద్యోగుల కష్టార్జితాన్ని భద్రంగా వుంచడానికే తాము అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నామని ఈ అకౌంట్ల బదిలీలకు అదే కారణమని చెబుతున్నారు. అయితే యాక్సిస్ బ్యాంకులో అమృత ఫడ్నవీస్ పనిచేస్తుండడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు లోగ్గుట్టు కూడా మహారాష్ట్ర వాసులకు తెలిసిందే. అయితే అమె ఆ బ్యాంకులో ఉన్నత హాదాలో వున్నారని విషయాన్ని పక్కనబెడితే.. కావాలని వివాదంలోకి వెళ్లి తన మెడకు చుట్టుకుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అదెలా.? ఏమిటా వివరాలు అంటారా..

ఇటీవల రాహుల్ గాంధీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను సావర్కర్‌ను కాదని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇస్తూ సావర్కర్ గురించి రాహుల్‌కు ఒక్క ముక్క కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్‌ను ఆయన భార్య అమృత ఫడ్నవీస్ రీట్వీట్ చేస్తూ.. థాకరే అనే పేరును తగిలించుకున్నంత మాత్రాన అందరూ థాకరేలు అయిపోరంటూ ఉద్ధవ్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు.

అమృత ట్వీట్‌కు శివసేన మహిళా నేత ప్రియాంక చతుర్వేది అంతే ఘాటుగా బదులిచ్చారు. ఉద్దవ్ పేరుకు తగ్గట్టుగానే జీవిస్తున్నారని, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమృతను లక్ష్యంగా చేసుకునే ప్రభుత్వం మున్సిపల్ సిబ్బంది వేతనాలను యాక్సిస్ నుంచి మరో బ్యాంకుకు మార్చుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Amruta Fadnavis  Axis Bank  TMC  BMC  Bank Accounts  National Bank  Uddhav Thackeray  Maharashtra  Politics  

Other Articles