Woman held for honey-trapping businessman వలపు వల.. బ్లాక్ మెయిల్.. కటకటాల్లో కిలాడీ లేడీ..

Woman held for honey trapping businessman in hyderabad

Maheshwari, Arrest, Cheating, Hyderabad, Cyberabad Commissionerate, Honey Trap, KPHB, Crime

The Madhapur police in Hyderabad on Thursday arrested a woman and her lover for blackmailing a businessman after honey trapping him.

వలపు వల.. బ్లాక్ మెయిల్.. కటకటాల్లో కిలాడీ లేడీ..

Posted: 12/27/2019 12:43 PM IST
Woman held for honey trapping businessman in hyderabad

మగాళ్లకు వలపు వల విసరి.. వారు తన బుట్టలోపడేలా చేసుకుంటుంది. ఇలా వల విసిరగానే పడిన వారికి తన ఇంటిలో, లేక తనకు తెలిసిన లాడ్జీకో రప్పించుకుంటుంది. నాలుగు గోడల మధ్య జరిగే శృంగారాన్ని తన అసలైన ప్రియుడి సహకారంతో వీడియో తీస్తుంది. అక్కడితో వలపు వలకు తెరపడుతుంది. ఆ తరువాత అమె తన ప్రియుడితో కలసి మరో కథకు తెర లేపుతుంది. అదే బ్లాక్ మెయిలింగ్. తన వలలో పడిన వ్యక్తి నుంచి లక్షలకు లక్షలు లాగేస్తుంది. ఇదీ మహేశ్వరీ ఆపరేషన్ సెక్స్ రాకెట్.. ప్రస్తుతం ఈ కిలాడీ లేడితో పాటు అమె ప్రియుడ్ని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

పోలీసులకు చిక్కిన విధంబెట్టిదనినా.. మణికంఠ అనే కాంట్రాక్టరుకు టెండర్‌ ఆన్ లైన్‌ అప్లికేషన్లు పూర్తి చేసే క్రమంలో.. మణికంఠతో మాటలు కలిపింది మహేశ్వరి. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మహేశ్వరి అమాయకంగా కనిపించినా.. అమె టెండర్ల అప్లికేషన్ ఫామ్ పూరించే క్రమం చూసిన మణికంఠ చాలా తెలివైనది అని ఆమెతో పరిచయం చేసుకున్నాడు. ఈ పరిచయాన్ని మహేశ్వరి తనకు అనుకూలంగా మార్చుకుంది. మణికంఠపై వలపు వల విసిరింది.

లోగుట్టును అర్థం చేసుకోని మణికంఠ ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ నెల 14న వీరిద్దరూ కూకట్‌పల్లి విజయానగర్‌ కాలనీలోని ఓయో లాడ్జిలో గడిపారు. అనంతరం మహేశ్వరి తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి మణికంఠను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం పన్నింది. ఇందులో భాగంగా సంతోష్‌తో మణికంఠకు ఫోన్‌ చేయించి తాము కూకట్‌పల్లి పోలీసులమని చెబుతూ లాడ్జిలో గడిపిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని అతడిని బెదిరించి అతడి నుంచి రూ.4.49 లక్షలు వసూలు చేయడంతో పాటు ఐఫోన్‌ కూడా తీసుకున్నారు.

అంతటితో ఆగని వారు మరో రూ. 1.5లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడికి అప్పుడు కానీ జ్ఞానోదయం కాలేదు. ఇలా తాను ఎల్లకాలం డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని భావించిన మణికంఠ ఈ నెల 22న మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేపీహెచ్‌బీ పోలీసులకు బదిలీ చేశారు. కేపీహెచ్‌బీ పోలీసులు మణికంఠ ద్వారా నిందితులకు ఫోన్‌ చేయించి డబ్బులు తీసుకునేందుకు ఫోరంమాల్‌ వద్దకు రావాలని చెప్పారు. గురువారం ఉదయం మహేశ్వరి, సంతోష్‌ అక్కడికి రాగానే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా నేరం అంగీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maheshwari  Arrest  Cheating  Hyderabad  Cyberabad Commissionerate  Honey Trap  KPHB  Crime  

Other Articles