Modi should say aopology to protesters అందుకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిందే: డికే

Dk shivakumar demands apology from prime minister over urban naxal statement

urban naxals, Prime Minister Modi, students, intellectuals, CAA Protest, NRC protests, Karnataka government, prohibitory orders in Mangaluru, Congress leader DK Shivakumar, Karnataka, Politics, Crime

Senior Congress leader DK Shivakumar demanded an apology from the Prime Minister for allegedly referring to students and intellectuals of the country as 'urban naxals'. "The students, intellectuals who are protesting to save the constitution are been called as urban naxals by the PM. I urge the Prime Minister to apologize to the people of the nation".

అందుకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిందే: డికే శివకుమార్

Posted: 12/24/2019 05:48 PM IST
Dk shivakumar demands apology from prime minister over urban naxal statement

దేశంలోని మేథావులు, విద్యార్థులను 'అర్బన్ నక్సల్స్'తో పోల్చిన ప్రధాని నరేంద్ర మోదీ భేషరుతుగా వారికి క్షమాపణ చెప్పాలని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. ఫౌరసత్వ సవరణ చట్టం.. జాతీయ ఫౌర రిజిస్ట్రార్ లకు వ్యతిరేకంగా ఉధ్యమిస్తున్న వారిని నగర నక్సలైట్లుగా సంబోధించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డిన ఆయన ప్రధాని తక్షణం తాను వినియోగించిన పదాలను వెనక్కు తీసుకోని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపి పార్టీ అధికారంలోకి రావడానికి అదే అర్భన్ నక్సలైట్లు దోహదపడ్డారని ఆయన చురకలంటించారు.

ఎన్నికల సమయంలో బీజేపి పార్టీకి అందరూ సమానమనే అంటారని, సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అన్న పెద్ద పెద్ద డైలాగులు చెబుతారని, అయితే ఎన్నికలు పూర్తైన తరువాత.. ఆచరణలో మాత్రం విభజించి పాలించడం అనే సిద్దాంతాన్ని ఫాలో అవుతూ.. వ్యతిరేకంగా ఉధ్యమించిన వారిని అర్బన్ నక్సల్స్ గా ముద్రవేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో మోదీ 'అర్బన్ నక్సల్స్' వ్యాఖ్యలు చేయగా, ఆ వ్యాఖ్యలను డీకే శివకుమార్ ఓ ప్రకటనలో ఖండించారు.
 
'రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ నిరసన తెలిపిన విద్యార్థులు, మేథావులను ప్రధాని అర్బన్‌ నక్సల్స్‌తో పోల్చారు. ఇందుకు గాను ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి' అని డీకే అన్నారు. మోదీ చెబుతున్న ఈ ప్రజల మద్దతుతోనే బీజేపీ ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని, ఇప్పుడు ఆ ప్రజలే రోడ్లపైకి వచ్చినప్పుడు నిందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 'ప్రజలను రోడ్లపైకి వచ్చేలా చేశారు. అందుకోసం ప్రజలు మీకు అధికారం కట్టబెట్ట లేదు. ఆర్థిక మందగమనంతో దేశం సతమతమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఇలాంటి చట్టం తెచ్చింది. ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది' అని డీకే మండిపడ్డారు.
 
నిరుద్యోగ సమస్యపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు, ఉద్యోగాల కల్పనకు ఎవరూ సిద్ధపడటం లేదని, ప్రతి ఒక్కరూ కొత్త పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. 'మీకు సపోర్ట్ చేస్తున్న అన్నాడీఏంకే, బిజూ జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సైతం ఈ చట్టం తప్పు అని చెప్పారు' అని డీకే గుర్తు చేశారు.పౌరసత్వ బిల్లుపై నిరనలను అడ్డుకునేందుకు మంగళూరులో నిషేధ ఉత్తర్వులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా డీకే తప్పుపట్టారు. 'ఇందుకు మంగళూరు పోలీసులను నేను తప్పుపట్టడం లేదు. సిటీలో 144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, ముఖ్యమంత్రిదే ఆ తప్పు' అని శివకుమార్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : urban naxals  PM Modi  students  intellectuals  CAA Protest  NRC protests  DK Shivakumar  Karnataka  Politics  

Other Articles