JMM-Congress combine pass halfway mark జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి పక్షానిదే విజయం..

Jmm congress led opposition alliance crosses halfway mark in leads for jharkhand

Jharkhand election results, Jharkhand election results 2019, Jharkhand elections 2019, congress-JMM, BJP, Hemanth soren, Mahagathbandhan, Jharkhand Polls, Jharkhand Polls Results, Jharkhand BJP, Tejashwi Yadav, Jharkhand, Politics

Jharkahnd Election Results: In Jharkhand elections leads the Congress and the JMM combine have crossed the majority mark in the 81-seat assembly with 45 seats. BJP is second leading on 25 seats.

జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి పక్షానిదే విజయం..

Posted: 12/23/2019 11:35 AM IST
Jmm congress led opposition alliance crosses halfway mark in leads for jharkhand

పౌరసత్వ సవరణ చట్టం, పెరుగుతున్న ధరలు, కేంద్రంలోని అధికార బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న క్రమంలో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం, ఎఆర్సీలకు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు విడుదల కావడం.. రాష్ట్రంలో అధికార బీజేపికి వ్యతిరేకంగా ప్రజలు తమ తీర్పును వ్యక్తం చేయడంతో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ పార్టీల కూటమి స్పష్టమైన అధికారం దిశగా పరుగులు తీస్తోంది.

జార్ఖండ్ లోని మొత్తం 81 స్థానాల్లో బీజేపీ 25 చోట్ల మాత్రమే తమ ప్రభావాన్ని చాటింది. 2014లో బీజేపీ 37 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపి ఈ సారి కూడా రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే గత ఎన్నికలలో కేవలం 25 స్థానాలకే పరిమితమైన జార్ఖండ్ ముక్తిమోర్చ పార్టీ.. ఈ ధఫా ఎన్నికలలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ పార్టీలతో కలసి పోటీ చేసింది. అయితే ఈ మహాకూటమిని జార్ఖండ్ ఓటర్లు ఆదరించారు.

తాజా ఎన్నికల్లో యూపీఏ కూటమి ఇప్పటికే 45 స్థానాల్లో (జేఎంఎం 26, కాంగ్రెస్ 15, ఆర్జేడీ 4, ఎన్సీపీ 1) ఆధిక్యంలో దూసుకెళుతోంది. దీంతో దాదాపుగా ఝార్ఖండ్ రాష్ట్రం దాదాపుగా బీజేపీ చేజారినట్టేనని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుది ఫలితాలు కూడా రమారమి ఈ ట్రెండ్ లోనే సాగనున్న క్రమంలో జార్ఖండ్ లో మహాకూటమి పార్టీలే అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నాయి. మరికొద్దిసేపట్లో విజేతలు ఎవరన్నదానిపై పూర్తి క్లారిటీ రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles