Pawan Kalyan demands YCP to apologise Rapaka రాపాకకు క్షమాపణ చెప్పండీ: పవన్ కల్యాణ్

Pawan kalyan demands ycp to apologise rapaka on spreading fake news

Pawan Kalyan, JanaSena, Naga babu, YCP Leader Comments, Rapaka VaraPrasad, JanaSena MLA, apology, Show Cause, Fake news, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, Religion, caste, colourism, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

Jana Sena Chief Pawan Kalyan reacted to the to the fake news which gone viral on net, stating JanaSena Party has issued a Show Cause notice to its only MLA Rapaka Varaprasad, and demanded YCP leaders to ask apology.

వైసీపీ నేతలూ.. రాపాకకు క్షమాపణ చెప్పండీ: పవన్ కల్యాణ్

Posted: 12/13/2019 07:09 PM IST
Pawan kalyan demands ycp to apologise rapaka on spreading fake news

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసీపీ నేతలు తక్షణం క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తాను కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షలో భాగంగా 12 గంటల పాటు దీక్ష చేయగా, అదే సమయంలో అదును చూసి కొందరు అబద్దాలను నిజాలుగా వక్రీకరించి.. తప్పుడు వార్తలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విసృత్తంగా ప్రచారం చేశారని.. ఇవి తొలుత వచ్చింది వైసీపీ నేతలకు చెందిన పత్రికలలోనేనని గుర్తించామని, అందుకని వారు రాపాకకు క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాన్ డిమాండ్ చేశారు.

పవన్ దీక్ష చేపట్టిన అదే సమయంలో అసెంబ్లీలో జగన్ సర్కారు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతుండటాన్ని రాపాక వరప్రసాద్ సమర్థించారు. ఇదే అదునుగా చేసుకుని క్షణాల్లో తప్పుడు వార్తలను సృష్టించి ప్రచారం చేశారు. అయితే దీనిలో కొంత వాస్తవం వుంటే.. దానికి చెంతాడంత కల్పితాన్ని కలగలపి.. మంచి స్టోరీని అల్లేశారు. పార్టీ మారనని ఆయన చెప్పినప్పటికీ.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు. పవన్ కల్యాణ్‌కు, తనకు మధ్య గ్యాప్ ఉందన్నారు. ఇంతవరకు కరెక్టే కానీ దీన్ని అసరాగా చేసుకుని ఓ ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది.

ఇక ఫేక్ న్యూస్ ఏంటంటే.. రాపాక వరప్రసాద్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇక దీనికి రాపాక కూడా ఘాటుగా స్పందించారని ప్రచారం చేశారు. ‘‘నాకు ఎవరో షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటి? నేను గెలిచిన ఎమ్మెల్యేను.. వాళ్లు ఓడిపోయిన వారు. ఇది మరీ విచిత్రంగా ఉంది.. పార్టీ మీద ఏదైనా అధికారం అనేది ఉంది అంటే నాకు మాత్రమే ఉంది. జనసేన పార్టీ వల్ల, ఆ కార్యకర్తలు వల్ల నేను గెలవలేదు.. నేను ఎవరి భిక్షతో ఎమ్మెల్యే కాలేదు.. నా సొంత శక్తి తో గెలిచాను తప్ప నాకు ఎవరి భిక్ష అవసరం లేద’’ని రాపాక అన్నట్టుగా వార్త వైరల్ అయ్యింది.

ఈ విషయం దీక్షలో వున్న పవన్ కల్యాణ్ కు నిన్న తెలియలేదు. అయితే దీక్ష విరమించిన తరువాత ఆయన తన పనిలో తానుండగా, ఇవాళ ఆయన దృష్టికి ఈ ఫేక్ న్యూస్ వచ్చింది. అంతే తాను రాపాకకు షోకాజ్ నోటీసు ఇచ్చానని తప్పుడు ప్రచారం జరుగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ మద్దతుదారులు జనసేనపై దుష్ప్రచారం ఆపాలని ఆయన హితవు పలికారు. వైసీపీ సంబంధిత సైట్లో రావడం చూస్తుంటే.. ఎవరు చేయించారో అర్థం అవుతోందన్నారు. రాపాకను అరెస్ట్ చేసి బెయిల్ రానీయకుండా వైసీపీ నాయకులు ప్రయత్నించినప్పుడు.. స్వయంగా నేనే రంగంలోకి దిగడానికి వచ్చినప్పుడు వారు వెనక్కి తగ్గారన్నారు. తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు రాపాక గారికి క్షమాపణలు చెప్పాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  Rapaka VaraPrasad  JanaSena MLA  apology  Show Cause  Fake news  Andhra Pradesh  Politics  

Other Articles