Rahul refuses to apologise for his rape remarks అత్యాచార వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పను: రాహుల్ గాంధీ

Modi called delhi a rape capital says rahul gandhi refuses to apologise

Narendra Modi, amit shah, Rahul Gandhi, BJP, Congress, Smriti Irani, Uttarakhand Assembly Elections, Varanasi, Unnav, BJP MLA accused, Delhi, politics

Congress leader Rahul Gandhi on Friday said that the BJP is trying to divert attention from the northeast, which is witnessing widespread violence due to the Citizenship Act.

ITEMVIDEOS: అత్యాచార వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పను: రాహుల్ గాంధీ

Posted: 12/13/2019 06:13 PM IST
Modi called delhi a rape capital says rahul gandhi refuses to apologise

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్ సభలో దుమారం రేగింది. అత్యాచార ఘటనల నేపథ్యంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు రేపిస్టులను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని బీజేపీ విమర్శించింది. ఈ క్రమంలో రాహుల్‌ క్షమాపణ చెప్పాలంటూ అధికార పార్టీ ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచార పర్వాలు కొనసాగడం గురించి రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ... ‘ ఇది మేకిన్‌ ఇండియా కాదు. రేపి ఇన్‌ ఇండియా’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రధాని మోదీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఓ యువతిపై అత్యాచారం చేసినా.. ఆయన స్పందించడం లేదని విమర్శించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌ వ్యాఖ్యలను లోక్‌సభలో ప్రస్తావించారు. తన వ్యాఖ్యలతో రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడండీ అంటూ పిలుపునిచ్చిన ఆయనను శిక్షించాల్సిందేనన్నారు. తన వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణ చెప్పి తీరాలి అని డిమాండ్ చేశారు. ‘మగవాళ్లంతా రేపిస్టులు కారు. రాహుల్‌ వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని.. రాహుల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే రాహుల్‌ గాంధీ పార్లమెంటుకు చేరుకునే సమయానికి లోక్ సభను నిరవధిక వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు బయట విలేకరులతో మాట్లాడిన రాహుల్‌.. రేపిన్‌ ఇండియా వ్యాఖ్యలపై తాను క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. ‘ప్రధాని మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడుతుంటే.. ప్రతీ వార్తా పత్రికలో అత్యాచారాల గురించే కనిపిస్తోందని అన్నాను. ఈ విషయంలో నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’ అని రాహుల్‌ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసనలపై దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి చవకబారు చర్యలకు దిగుతోందని విమర్శించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై డీఎంకే నేత కనిమొళి స్పందిస్తూ.. బీజేపి నేతలు తమ విషయానికి వస్తే ఒకలా.. మరోకరి విషయానికి వస్తే మరోలా వ్యవహరిస్తారని అన్నారు. రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు సభ వెలుపల చేశారని, గతంలో తాము ఇలాంటి ఉదంతాలను ప్రస్తావిస్తే సభ వెలుపల జరిగిన వాటిని ఉటంకించరాదని తమను అనుమతించని విషయాన్ని అమె సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాని నిత్యం మేకిన్‌ ఇండియా గురించి చెబుతుంటారని, దురదృష్టవశాత్తూ అది సాధ్యం కాకపోయినా.. దేశంలో మహిళలపై లైంగిక​దాడులు మాత్రం జరుగుతున్నాయని ఇదే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles