Tirumala Priests to follow Dhanurmasam ritual తిరుమల శ్రీవారికి ధనుర్మాస ఆచారం.. సుప్రభాతం బదులు..

Tirumala priests to follow dhanurmasam ritual for a month

Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, Dhanurmasam, godadevi, pashurallu, suprabatam, Vaikunta dwaram, Vaikunta Ekadasi, Mukkoti Ekadasi, Uttara dwara darshanam, devotional

Tirumala tirupati devasthanam Temple Board has taken desicion to cancel suprabatam to the Lord Sri Venkateshwara to follow DhanurMasam ritual.

తిరుమల శ్రీవారికి ధనుర్మాస ఆచారం.. సుప్రభాతం బదులు..

Posted: 12/12/2019 04:52 PM IST
Tirumala priests to follow dhanurmasam ritual for a month

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి అరుదైన సేవలు అందించేందుకు తిరుమల అర్చకులు సిద్దమయ్యారు. నెల రోజుల పాటు ఆపదమొక్కుల వాడిని మేలుకొలుపు విషయంలో సుప్రభాతానికి స్వస్తిపలకునున్నారు. అందుకు బదులుగా తిరుప్పావై పఠనంతో మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు. ధనుర్మాసంలో ఈ విధంగా మేల్కొలుపు  జరపాలని నిర్ణయించుకున్న అర్చకులు అందుకు టీటీడీ బోర్డు అనుమతిని కూడా పోందారు. దీంతో ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం కొసాగనుంది.

నిత్యం సుప్రభాత సేవతో మేల్కొనే కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరుడు.. ధనుర్మాసంలో నెలరోజుల పాటు తిరుప్పావై పఠనంతో నిద్రలేవనున్నాడు. ఈ నెలరోజుల పాటు శ్రీవారికి సుప్రభాతానికి బదులుగా గోదాదేవి రచించిన పాసురాలుతో మేల్కొలుపు జరుగుతుంది. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాశురాలనే గోదాదేవి పాశురాలు అంటారు. వీటిని ధనుర్మాస నెలలో ప్రతి రోజూ ఒక్కో పాశురాన్ని సుప్రభాతంకు బదులుగా పఠిస్తు స్వామి వారిని మేల్కోపనున్నారు అర్చకభగవానులు.

ధనుర్మాసం నెలరోజులు ఈ విధంగా గోదాదేవి పాసురాలుతో స్వామివారిని మేల్కోలుపడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక ఈనెల రోజుల పాటు స్వామి వారికి నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసిదళాల బదులుగా బిల్వపత్రాలతో నిర్వహిస్తారు. మరో వైపు స్వామి వారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు. పరమ భక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు జరిగే మోహినీ అవతారం సందర్భంగా పుత్తూరు నుండి అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు, చిలుకతో పాటు, గరుడ సేవలో అలంకరించేందుకు తులసి మాలలు స్వామి వారికి సమర్పిస్తారు.

జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను పునరుద్దరిస్తారు. దేవతలకు 6 నెలలు కాలం పగలుగా మరో 6 నెలలు కాలం రాత్రిగా పరిగణిస్తారు. ఇక ధనుర్మాసం నెల దేవతలకు బ్రహ్మముహుర్తంగా పరిగణిస్తారు. ఆ సమయంలో దేవతలు ఎంతో ప్రశాంతంగా ఉంటారనీ....ఆ వేళలో భక్తులు దేవతలను పూజిస్తే సులభంగా ప్రశన్నమవుతారన్నది భక్తుల విశ్వాసం. మరో వైపు శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం నెలలో వైకుంఠ ఏకాదశిని నిర్వహిస్తారు. ఏడాదికి 2రోజులు పాటు తెరిచి వుంచే వైకుంఠ ద్వారా భక్తులకు దర్శనం లభించేది ధనుర్మాసం నెలలోనే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD Board  Diety Sri Venkateshwara swamy  Dhanurmasam  godadevi  pashurallu  suprabatam  devotional  

Other Articles