Pawan fast to mount pressure on State govt, says Jana Sena కాకినాడలో ‘‘రైతు సౌభాగ్య దీక్ష’’కు జనసేన ఏర్పాట్లు..

Pawan kalyan s kakinada hunger strike protest named rythu soubhagya deeksha

Pawan Kalyan, JanaSena, Pantam Nanaji, Rythu Soubhagya Deeksha, Kakinada, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, Religion, caste, Chirstianity, HInduism, colourism, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

Jana Sena leader Pantam Nanaji said the 12-hour fast to be taken up by party chief Pawan Kalyan on December 12, named Rythu Soubhagya Deeksha, was aimed at highlighting the plight of farmers and mount pressure on the state government to act.

కాకినాడలో ‘‘రైతు సౌభాగ్య దీక్ష’’కు జనసేన ఏర్పాట్లు..

Posted: 12/11/2019 01:07 PM IST
Pawan kalyan s kakinada hunger strike protest named rythu soubhagya deeksha

రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 12న దీక్షకు సన్నధమవుతున్నారు. రైతులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని, వారి సమస్యల విషయంలో గొంతెత్తి అరిచినా ప్రభుత్వం చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందంగా వ్యవహరిస్తోందని జనసేనాని అన్నారు. ఈ క్రమంలో రైతుల సమస్యలను కూడా లాంగ్ మార్చ్ తరహాలోనే ప్రభుత్వానికి తెలియజేయాలని కాకినాడలో దీక్షను చేపట్టనున్నారు. ఈ దీక్షకు ‘రైతు సౌభాగ్య దీక్ష’గా నామకరణం చేశారు.

రైతు సౌభాగ్య దీక్షకు సంబంధించిన పోస్టర్ ను పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్‌ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని అరోపించారు. వరి పంట వేయడానికే రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలు వున్నాయని.. గిట్టుబాటు ధర లేక, ఖర్చులు రాబట్టుకోలేక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధర అకాశానంటినా.. ఉల్లి వేసిన రైతుకు మాత్రం లాభం లేదన్నారు. రైతుల నుంచి వెళ్లిన తరువాత ఆ ధరలకు రెక్కలు వస్తున్నాయని అన్నారు.

ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు అరకొర ధరలకే పంటలను విక్రయిస్తున్నారని అన్నారు. తన వద్దకు కొందరు రైతులు వచ్చి సమస్యలను ఏకరువు పెట్టారని అన్నారు. వారి సమస్యలను మరింత అధ్యయనం చేయడానికి క్షేత్రస్థాయికి వెళ్లాలనని చెప్పారు పవన్. మండపేట, పరిసర ప్రాంతాలలో పర్యటించి రైతులతో మాట్లాడానని.. వారు చెప్పిన మాటలు విన్న తర్వాతే మాటల్లో చెప్పలేనంత బాధ అనిపించింది అన్నారు. రైతులు నష్టాలపాలవుతున్నా సమాజంలో గౌరవం కోసం వ్యవసాయం చేస్తున్నామని రైతులు చెబుతున్నారన్నారు.

కోనసీమ రైతులు పంట విరామం ప్రకటించి నిరసన వ్యక్తం చేసిన ఘటనను ఊటంకించిన పవన్ కల్యాణ్.. 2011 నాటి పరిస్థితులు మరోమారు ఉత్పన్నం కాకూడదని అన్నారు. పంట విరామం ప్రకటించడంతో ఆనాడు దేశమంతా నివ్వెరపోయిందని.. జాతీయ మీడియా కూడా ఇక్కడికి వచ్చి రైతు సమస్యలపై అధ్యయనం చేసిందని అన్నారు. అటువంటి రైతు ఆగ్రహాన్ని మరోమారు చూడకుండా ఉండాలంటే పాలకులు కళ్ళు తెరవాలి అన్నారు. వ్యవసాయాన్ని దండగలా కాకుండా పండుగలా చేయాలని.. అటువంటి రోజు కోసమే 12న దీక్ష తలపెట్టామని.. ప్రతీ జనసైనికుడు రైతుకు సంఘీభావం తెలపాలి అన్నారు. వారి కన్నీటిని తుడవడానికి ప్రయత్నించాలి అన్నారు.

ఎకరాకు 35 వేల రూపాయలు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరతో ఖర్చులు కుడా రావడం లేదన్నారు పవన్. కౌలు రైతులకు అదనంగా మరో 15 వేల రూపాయల కౌలు భారం మోయవలసి ఉందన్నారు. దీనివల్ల 75 కిలోల బస్తాకు సగటున ఇప్పుడు ఇస్తున్న కనీస మద్దతు ధర రూ.1361 ఉంటే అది రూ.2వేలు రూపాయలు చేసినప్పుడే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారన్నారు. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో రైతు కొట్టుమిట్టాడుతున్నారని.. మరి దీనిపై ఆలోచించే వారు ఎవరు అని ప్రశ్నించారు. వారి దుస్థితిని జగన్‌ రెడ్డి గారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ దీక్ష చేయాలని సంకల్పించానని జనసేనాని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  Pantam Nanaji  Rythu Soubhagya Deeksha  Kakinada  Andhra Pradesh  Politics  

Other Articles