'Multiple' people dead in New Jersey shooting కాల్పుల కలకలంతో దద్దరిల్లిన అగ్రరాజ్యం.. న్యూజెర్సీలో 6గురు మృతి

Black clad duo open fire on jersey city sidewalk killing hero cop three others including two brooklyn residents

New Jersey shootout, New Jersey firing, New Jersey firing incident, New Jersey shooting, New Jersey gunbattle, New Jersey gunfight, New Jersey latest news, New Jersey gunbattle death toll, New Jersey shootout, Assailants, black dressed, Hudson County city, kosher Market, New Jersey, New Jersey Encounter, America

The killing started inside a Jersey City cemetery, with a hero Jersey City cop gunned down as he tried to stop two suspicious men. It ended four hours and hundreds of spent bullets later, with the two suspects killed by police, after the homicidal pair gunned down three more innocent victims inside a kosher grocery story in a shootout that paralyzed the Hudson County city.

కాల్పుల కలకలంతో దద్దరిల్లిన అగ్రరాజ్యం.. న్యూజెర్సీలో 6గురు మృతి

Posted: 12/11/2019 11:50 AM IST
Black clad duo open fire on jersey city sidewalk killing hero cop three others including two brooklyn residents

అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. న్యూజెర్సీలో కాల్పుల మోతతో దద్దరిల్లింది. న్యూజెర్సీలోని జెర్సీ నగరంలోని హడ్ సన్ కౌంటీ నగరవాసులందరినీ భయాందోళనకు గురిచేసింది. ఈ కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు అనుమానిత నిందితులు, అగంతకులు పారిపోయేముందు వారిని అడ్డుకునేందుకు యత్నించిన ఓ పోలీసు ఉన్నతాధికారిని కూడా వీరమరణం పోందారు. కాగా ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు, పౌరుడు గాయపడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో న్యూజెర్సీలోని జెర్సీ సిటీకి ట్రక్కులో నల్లని దుస్తులతో వచ్చిన ఇద్దరు అగంతకులు.. అధునాతన ఫై పవర్డ్ రైఫిళ్లతో ఒక్కసారిగా జెర్సీ సిటీలోని హడ్ సన్ కౌంటీ సిటీలో సైడ్ వాక్ పై నడుచుకుంటూ వెళ్తున్న బాటసారులపై కాల్పులు ప్రారంభించారు. ఏం జరుగుతుందో తెలియని స్థానికులు తీవ్ర భాయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించేందుకు ప్రయత్నించారు.

ఇంతలో దుండగులు వారిపై కూడా కాల్పులుకు దిగారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. పోలీసులకు, దుండగులకు మధ్య నాలుగు గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. వందల రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. అయితే చివరకు అగంతకులు బేవ్యూస్ సిమెంట్రీ నుంచి దొంగలించిన యు హౌల్ వాహనంలో అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే వారిని వెంబడించిన పోలీసులకు కిలోమీటరున్నర దూరంలోని ఓ కోషన్ సూపర్ మార్కెట్ లో దుండగులు నక్కారని సమాచారం అందింది.

ఈలోగా అక్కడకు చేరుకున్న పోలీసులు చాకచక్యంగా సూపర్ మార్కెట్లోకి వెళ్లాగా ఇద్దరు అగంతకులతో పాటు మరో ముగ్గురు కూడా నిర్జీవంగా పడివున్నారు. స్థానికులను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటనలో అగంతకులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి జోసెఫ్ సీల్స్ వీరమరణం పోందారు. కాగా, ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే అగంతకులు ఎందుకు కాల్పులకు తెగబడ్డారన్న విషయం పోలీసులకు అంతుచిక్కడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles