PD Act on TV Actor Vicky In Robbery case జల్సాలకు అలవాటుపడిన టీవీ నటుడిపై పీడి యాక్టు..

Preventive detention act on tv actor vicky in robbery case

kukatpally police, PD Act, Television Actor, Vicky Balija, robbery case, BhagyaNagar colony, Kukatpally, Cyberabad, Crime

The kukatpally police had imposed PD Act agianst Television Actor Vicky Balija alias Vicky Bhai in connection with robbery case in BhagyaNagar colony of the PS limits and recoverd Gold worth RS. 12 Lakhs

జల్సాలకు అలవాటుపడిన టీవీ నటుడిపై పీడి యాక్టు..

Posted: 12/10/2019 11:52 AM IST
Preventive detention act on tv actor vicky in robbery case

గొడ్డుచాకిరీ చేసినా.. అందుకు తగిన ప్రతిఫలం లభించక అనేక మంది ఇబ్బందులు పడుతుంటే.. జల్సాలవేటలో ఈజీమనీ కోసం దారి తప్పి.. కటకటాలపాలు అవుతున్నవారు ఇంకోందరు. ఈ రెండో కోవకు చెందినవారిలో ఓ బుల్లితెర నటుడు కూడా చేరడమే పలువుర్ని విస్మయానికి గురిచేస్తోంది. అవకాశాలు లభించక, వచ్చినా అందిపుచ్చుకోలేక ఎంతో మంది ఇప్పటికీ ప్రయత్నాలు సాగిస్తుండగా, వచ్చిన అవకాశాలను కాలదన్నుకుని.. ఈజీ మని వేటలో కెరీర్ ను నాశనం చేసుకున్న నటుడు.. దొంగోడి అవతారం ఎత్తాడు.

అయితే నటుడు కదా అని పోలీసులు కేసు పెట్టినా.. అతని కెరీర్ లో మళ్లీ సెటిల్ కావాలన్న ఆశతో అతడి వివరాలను మీడియాలో పెద్దగా హైలైట్ చేయలేదు. అయితే దీన్నే అదునుగా తీసుకున్న సదరు నటుడు దొంగతనాలే తన వృత్తి.. ప్రవృత్తిగా మలుచుకున్నాడు. లగ్జరీ లైఫ్ అన్వేషణలో.. కటకటాలోక్కి వెళ్లినా.. ఇంకా తీరు మార్చుకోలేదు. బెయిలుపై బయటకు వచ్చిన తరువాత కూడా అదే పంథాను అనుసరించాడు. తాజాగా కూకట్ పల్లిలో జరిగిన ఓ చోరీలో కూడా అతని ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు నటుడ్ని కటకటాల వెనక్కి పంపారు.

పోలీసుల కథనం ప్రకారం.. నాగారం వికాశ్ నగర్ కు చెందిన బలిజ విక్కీ (28) టీవీ సీరియల్ నటుడు. నటన ద్వారా వస్తున్న డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో 2018లో చోరీల బాట పట్టాడు. అతడిపై కుషాయిగూడ, ఉస్మానియా యూనివర్సిటీ, నల్లకుంట పోలీస్‌స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఓయూ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఈ ఏడాది ఆగస్టు 9న బయటకు వచ్చిన విక్కీ తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోలేదు. నవంబరు 15న కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో చొరబడి ఫ్లాట్‌ తాళం పగలగొట్టి 300 గ్రాముల బంగారు నగలు అపహరించాడు.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్‌ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చోరీకి పాల్పడింది విక్కీయేనని గుర్తించారు. నిన్న ఉదయం అతడిని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి  రూ. 12 లక్షల విలువైన 330 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ పి.సురేందర్ రావు నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. విక్కీపై గతంలోనే పీడీ యాక్ట్ ప్రయోగించినా బుద్ధి మార్చుకోకుండా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడని ఏసీపీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles