youngers sexual assault on Elder brother's wife in Guntur వదినమ్మను కూడా వదలని కామోన్మాదులు..

Youngers sexual assault on elder brother s wife in guntur

sexual assault on brother's wife, husband father molestation, married woman, spandana, district police, justice, divorce, old Guntur, crime against woman, rape, gangrape, Andhra Pradesh, Crime

The Woman was forced by her husband to give divorce after she had been booked in a theft case. But She reveals shocking incidents in spandana programe that she was been sexually assaulted by husband three younger brothers and this was the reason she was booked in a theft case.

వదినమ్మను కూడా వదలని కామోన్మాదులు..

Posted: 12/10/2019 12:44 PM IST
Youngers sexual assault on elder brother s wife in guntur

మానవ సంబంధాలన్నీ మనీ చుట్టూ తిరిగే బంధాలే అన్న పెద్దలు.. డబ్బుకు వున్న శక్తిని గ్రహించగలిగారే కానీ.. ప్రకృతిలో సగమైన ఆడవారు.. వికృతుల చేతుల్లో చిక్కి శల్యమౌతుందని గుర్తించలేకపోయారా.? సంబంధాలను పాతరేసి.. పైశాచిక మృగాళ్లలా తెగబడుతున్నారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో పాత గుంటూరు నగరంలో జరగిన ఘటనను పరిశీలిస్తే.. మారుతున్న మానవ సంబంధాలు.. మగమృగాళ్ల కామోన్మాదానికి తల్లి కూడా బలికావాల్సిందేనా.? అన్న సందేహాలు రేకెత్తకమానవు.

తల్లి తరువాత ఆంతటి గొప్పతనాన్ని అందిపుచ్చుకునే స్థానం వదినమ్మది. అలాంటి వదినమ్మనే కామోన్మాదులైన మరుదులు చెరబట్టి.. కామవాంఛను తీర్చుకుంటే.. అది చాలదన్నట్లు కొడలిని కూతరిలా చూసుకునే సంస్కారం లేని మామ కూడా కొడలిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. తన వాంఛను కూడా తీర్చాలని వేధించాడు. అంతేకాదు ఈ విషయాలన్నీ తెలిసిన తరువాత తల్లిలా కోడలి పక్షాన నిలవాల్సిన అత్త కూడా తన కుమారుల పక్షాన చేరి హింసించింది. భర్తకు ఈ విషయాలను చెబితే ఆయన కూడా తన తమ్ముళ్లకు వంతపాడాడు.

దీంతో గత తొమ్మిదేళ్లుగా అమె నలుగురు కామాంధులున్న ఇంటి తన అవేధనను మౌనంగానే భరించింది. గొంతుదాటి వస్తున్న రోదనను పంటికింద బిగియపట్టుకుంది. ఈ క్రమంలో భర్త చిన్న సోదరుడు కూడా అమెకు పాలలో మత్తు మందు కలిపి ఇచ్చి ఆ తరువాత అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనకు ఎదురవుతున్న దారుణ వేధనను భరించలేక పోలీసులను ఆశ్రయించిన అమెపై దొంగతనం కేసు మోపి వేధించసాగారు. వారి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు ఎట్టకేలకు ‘స్పందన’ కార్యక్రమంలో పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

గుంటూరు రూరల్‌ మండలం దాసరిపాలెంకు చెందిన బాధితురాలి కథనం ప్రకారం..‘2011లో పాత గుంటూరుకు చెందిన ఓ వ్యక్తితో నాకు వివాహమైంది. కుటుంబసభ్యుల కోరిక మేరకు మామకు రోజూ సాయంత్ర కాళ్లు పట్టేదాన్ని. ఆ సమయంలో కూతురిలాంటి నాపై ఆయన అసభ్యంగా ప్రవర్తించేవాడు. దాన్ని అలుసుగా తీసుకుని ఇద్దరు మరుదులు నన్ను బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశారు. మూడో మరిది పాలల్లో మత్తుమందు కలిపి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం భర్తకు చెబితే తమ ఇంట్లో అలాగే ఉంటుందని, ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని అనడంతో పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టాను. దీంతో నాపై దొంగతనం మోపి అరెస్టు చేయించారని పేర్కోంది.

దీంతో ఈ కేసు నుంచి బయటకు వచ్చాక తనకు విడాకులివ్వాలంటూ భర్త బెదిరిస్తున్నారు. లేకపోతే చంపేస్తామంటున్నాడని చెప్పింది. సోమవారం గుంటూరు అర్బన్ పోలీసులు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితురాలు తమ ఆవేదనను పోలీసులకు వివరించింది. కామ పిశాచాల్లా తనపై మామ, మరుదులు లైంగిక దాడికి పాల్పడుతున్నా రక్షించాల్సిన భర్తే వాళ్లకు సహకరించాలని వంత పాడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వారిపై తగిన చర్యలు తీసుకుని తనకే న్యాయం చేయాలని వేడుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : married woman  spandana  district police  justice  divorce  sexual assault  Guntur  Andhra Pradesh  Crime  

Other Articles