Pawan Kalyan on the encounter of four accused దిశకు సత్వర న్యాయం అందింది: పవన్ కల్యాణ్

Instant justice has met pawan kalyan on the encounter of four accused

Pawan Kalyan, JanaSena, Disha case, Disha Encounter case, Women, Rape cases, sexual assault cases, molestation case, Instant Justice, Telangana, Crime

Jana Sena Chief Pawan Kalyan reacted to the encounter of the four accused in the heinous crime of rape and murder of Disha last week. He said that the peace met the Disha's soul and conveyed his greetings to Disha's parents and wished them a speedy recovery from the trauma and distress.

దిశ హత్య కేసుపై పవన్ కల్యాణ్: సత్వర న్యాయం చేకూరింది..

Posted: 12/06/2019 01:47 PM IST
Instant justice has met pawan kalyan on the encounter of four accused

తెలంగాణ వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యాచార కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ స్పందించారు. దిశకు సత్వర న్యాయం అందిందని అభిప్రాయపడ్డారు. దిశ కుటుంబసభ్యులకు ఈ తరహా శిక్షతో కొంత ఉపశమనం లభించిందని ఆయన పేర్కోన్నారు. తమ బిడ్డ దూరమైన విషాధ ఘటన నుంచి అమె తల్లిదండ్రులు త్వరగా తేరుకునేలా భగవంతుడు వారికి శక్తినివ్వాలని కోరారు. ఇక దిశ తరహా కేసుల్లో న్యాయస్థానాలు కఠిన శిక్షలను వేగంగా విధించాలని పవన్ అభిప్రాయపడ్డారు.

దిశ’ ఉదంతం నేరం చేయాలన్న అలోచనకు కనువిప్పు కావాలని, బహిరంగ శిక్షలు అమలు చేయాలని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘దిశ’ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య ‘దిశ’ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోందని పవన్ భావోద్వేగ ప్రకటన చేశారు. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదనే అని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  Disha case  Disha Encounter case  Women  Instant Justice  Telangana  Crime  

Other Articles