Disha parents welcomes accused encounter నిందితుల ఎన్ కౌంటర్ పై ‘దిశ’ కుటుంబం ఇలా..

Hyderabad disha case disha parents welcomes accused encounter

Disha, veterinary doctor, veterinary disha, disha case parents, disha parents encounter, disha case accused, cyberabad police, commissioner Sajjanar, mohammad arif, Siva, Navin, Chennakeshavulu, disha lorry drivers, disha veterinary doctor encounter, crimes against women, Telangana, Crime

Disha parents welcomes all the four accused in an alleged Encounter early Friday morning near Shadnagar, as they tried to escape. They said justice has been given to their daughter in the case.

ITEMVIDEOS: నిందితుల ఎన్ కౌంటర్ పై ‘దిశ’ కుటుంబం ఇలా..

Posted: 12/06/2019 01:16 PM IST
Hyderabad disha case disha parents welcomes accused encounter

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసులో నిందితులందరూ పోలీసుల ఎన్ కౌంటర్ లో హత్యమయ్యారన్న వార్తలు విన్న మృతురాలి తల్లిదండ్రులు పోలీసు చర్యలను స్వాగతించారు. పోలీసుల ఎన్ కౌంటర్లో తమ కూతురిని అపహరించి.. సామూహిక హత్యాచారం చేసి.. దహనం చేసిన బాధ ఎప్పటికీ తమ గుండెల నుంచి వెళ్లిపోదని కన్నిటి పర్యంతమైన తల్లిదండ్రులు.. పోలీసుల చర్యలను స్వాగతించారు. తమ కూతురిని నిందితులు ఎక్కడైతే దహణం చేశారో సరిగ్గా అక్కడే వారందరూ పోలీసులు వారిని తూటాలతో మట్టుబెట్టడంతో తమ బిడ్డకు న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు.

తమ బిడ్డ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరిందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల ఎన్ కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేసిన దిశ తల్లిదండ్రులు.. నిందితులకు తగిన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు. నిజానికి నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించామని, అయితే, అంతకుమించిన న్యాయం జరిగిందని అన్నారు. నిర్భయ ఘటనలో వారి తల్లిదండ్రులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని దీంతో తమకు న్యాయం జరిగేందుకు ఎన్నేళ్లు పడుతుందోనని అందోళన చెందామన్నారు.

సమాజంలోని ఏ ఆమ్మాయికి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అమె తెలిపారు. న్యాయం ఎప్పుడు జరుగుతుందోనని అన్నుకున్నామని, అయితే ఇలా తమ బిడ్డకు ప్రభుత్వం, పోలీసులు న్యాయం చేస్తారని, ఆమె ఆత్మకు శాంతి చేకూర్చుతారని తాను అనుకోలేదని తెలిపారు. ఇక దిశ సోదరి కూడా ఈ ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల ఇకపై ఈ ఘటనలు పునరావృతం కావని తాము భావిస్తున్నట్లు పేర్కోన్నారు. ఆమ్మాయిల రక్షణ విషయంలో చట్టాల్లో కూడా సమూల మార్పులు తీసుకురావాలని అమె పేర్కోన్నారు.

మహిళలకు రక్షణగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కూడా అవగాహన కల్పించాలని దిశ సోదరి అభిప్రాయపడ్డారు. ఇక భద్రత విషయంలో మహిళలు కూడా వారి జాగ్రత్త పట్ల వారు అప్రమత్తంగా వుండాలని అమె సూచించారు. అయితే తమ బిడ్డ దారుణ మరణం పట్ల తమకు ఉపశమనం లభించిందని కానీ దీంతో తమకు దూరమైన పాప తిరిగి రాదని దిశ తండ్రి అవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా అగంతకులకు గుండెళ్లో ఇది భయాన్ని రేకెత్తిస్తుందని అ్నారు. కాగా, నిందితుల మృతదేహాలను ఈ తెల్లవారుజామున నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరుగుతుండగా నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha  veterinary doctor  encounter  Disha parents  mohammad Arif  Siva  Navin  Chennakeshavulu  cyberabad police  Crime  

Other Articles