యావత్ దేశంలో నిర్బయ కేసు తరువాత అంతటి సంచలనాన్ని రేకెత్తించిన ఘటన వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యాచార కేసు. పోలీసుల తక్షణ స్పందన కరువై.. దిశ మానవ మృగాళ్ల మధ్య చిక్కిశల్యమై.. చివరకు పైశాచిక మృగాళ్ల చేతిలో దహనమైంది. అయితే తాజాగా ఈ కేసులో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. దిశను హత్య చేసిన తరువాత పెట్రోల్, డీజిల్ పోసి కాల్చివేశారని వచ్చిన వార్తల్లో నిజమెంత అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అమెను ప్రాణాలతో వుండగానే సజీవ దహనం చేశారని తెలుస్తోంది. ఈ వార్త నిజమా.? కాదా.? అన్న వివరాలను మాత్రం పోలీసులే వెల్లడించాల్సి వుంది.
దిశ హత్యకేసులో నిందితులను అరెస్టు చేసిన జైలులో పెట్టినా.. తప్పు చేశామన్న బాధ, పశ్చాతాపం వారిలో ఏ ఒక్కరిలోనూ కలగకపోవడం విచిత్రం. ఈ కేసులో నిందితులు రెండో రోజు మాత్రం నిందితులు ఒకరిపై మరోకరు అరుచుకున్నారని, ఇద్దరు మాత్రం జైలు అధికారులు హెచ్చిరించినా పలు మార్లు అరుచుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ నలుగురిని అత్యంత కట్టుదిట్టమైన బ్యారక్ లో వుంచిన జైలు అధికారులు.. వారికి భద్రతగా అక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జైలులో కాపలాగా వున్న గార్డుతో నిందితుల్లో ఒకడు ఈ విషయాన్ని చెప్పాడని తెలుస్తోంది.
కాపాలాకాసే గార్డులు నిందితులతో మాట కలపగా, ప్రధాన నిందితుడు మహమ్మద్ ఆరిఫ్, ఏ మాత్రం భయం లేకుండా తాము చేసిన దుర్మార్గపు నిర్వాకాన్ని పూస గుచ్చినట్టు చెప్పాడట. అమె తన స్కూటీని అక్కడ పార్కు చేసినప్పుడే అమెపై అఘాయిత్యానికి పాల్పడాలని ఫిక్స్ అయ్యామని, అందుకు అనుగూనంగా తాము పోలీసులకు దొరక్కుండా వుండేందుకు అమె వచ్చే వరకు పథక రచన చేశామని చెప్పారు. తాము భావించినట్టే దిశ ఆలస్యంగా తిరిగిరావడంతో.. అన్నీ తాము అనుకున్న విధంగానే చేశామని.. అయినా పోలీసులకు చిక్కుతామని ఊహించలేకపోయామని చెప్పాడని తెలుస్తోంది.
స్కూటీని పంక్చర్ చేసిన తరువాత అక్కడే నిలబడి ఫోన్ మాట్లాడుతున్న దిశను బలవంతంగా కాళ్లు, చేతులు పట్టుకుని లాక్కెళ్లామని, ఆమె పెద్దగా కేకలు వేస్తుంటే, ఎవరైనా వింటారన్న భయంతో తమ వద్ద ఉన్న మద్యాన్ని బలవంతంగా నోట్లో పోశామని, అప్పటికే తీవ్ర భయంతో ఉన్న ఆమె స్పృహ తప్పగా అత్యాచారం చేశామని ఆరిఫ్ చెప్పినట్టు జైలు సిబ్బందిలో ఒకరు వెల్లడించారు. మద్యం తాగించడంతో పాటు అత్యంత క్రూరంగా ప్రవర్తించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని చెప్పారు.
ఆ తరువాత అమెను లారీలో ఎక్కించుకుని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టామని చెప్పాడని తెలిపారు. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులూ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉండగా, వారిని కస్టడీకి ఇచ్చే విషయంలో నేటి ఉదయం 11 గంటల తరువాత షాద్ నగర్ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే షాద్ నగర్ కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. నిందితులను కోర్టుకు తీసుకువస్తే, ప్రజలు ఆందోళనకు దిగే అవకాశాలు ఉండటంతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపించాలని పోలీసులు ఇప్పటికే నిర్ణయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more