Locals save 2-year-old who fell off 3rd floor మూడో అంతస్తు నుంచి పడిన రెండేళ్ల బుడతడు సేఫ్..

2 year old s miraculous escape after fall from building in daman

2 year old boy falls off building, boy falls off, daman, daman and diu, boy falls off third floor, Daman and Diu, child falls from building, daman, infant, third floor, viral video, video viral

A 2-year-old-child in Daman and Diu had a close shave on Tuesday after he fell from the third floor of a building. The infant was saved by quick-thinking locals who caught him just in time. The child suffered no injuries.

మూడో అంతస్తు నుంచి పడిన రెండేళ్ల బుడతడు సేఫ్..

Posted: 12/04/2019 11:57 AM IST
2 year old s miraculous escape after fall from building in daman

అభం శుభం ఎరుగని ఓ రెండేళ్ల బుడతడు.. అడుకుంటూ భవనం మూడో అంతస్థు పైనుంచి పడినా.. ఎలాంటి గాయాలు లేకుండా, ఎంచక్కా కాపాడబడ్డాడు. అయితే ఆ బుడతడిని పట్టుకునే ప్రయత్నంలో ముగ్గురు యువకులకు మాత్రం స్వల్పగాయాలయ్యాయి. అత్యంత భయాందోళన కలిగించే ఈ ఘటన కేంద్రపాలిత ప్రాంతమైన డామన్‌ డయ్యూలో జరిగింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. డామన్ లో మంగళవారం రాత్రి సమయంలో స్థానిక భవనంలోని మూడో అంతస్థు నుంచి రెండేళ్ల బుడ్డోడు అడుకుంటూ బయటకు వచ్చాడు. నిలబడి వున్న బుడతడు ఒక్కసారిగా అదుపు తప్పి.. కిందకు జారిపోయాడు. అయితే ఇది గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. భవనం కింద గుమిగూడి బుడ్డోడిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు బుడ్డోడిని పట్టుకోడానికి గాలిలోకి చేతులు చాపారు. ఎట్టకేలకు ఓ యువకుడు బుడ్డోడిని క్యాచ్‌ పట్టి కిందపడ్డాడు.

అతనికి చుట్టూ చేరిన మిగిలిన యువకులు కూడా అతను పట్టుకోలేని పక్షంలో బుడతడని పట్టుకునేందుకు చేతులు చాచారు. బాలుడిని పట్టుకునే క్రమంలో ముగ్గురు యువకులు కిందపడ్డారు. దీంతో వీరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బుడతడిని పట్టుకునేందుకు యత్నించిన యువకులను నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పక్కవాడి కోసం మనకెందుకులే అనుకునే ఈ సమాజంలో బుడ్డోడి ప్రాణాలు కాపాడిన యువకులకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాబును రక్షించిన మీరు ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారంటూ ఓ నెటిజన్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daman and Diu  child falls from building  daman  infant  third floor  viral video  video viral  

Other Articles