no hangman in tihar jail for nirbhaya convicts నిర్భయ నిందితులకు ఉరి.. తలారీ ఏరీ..?

Nirbhaya case execution nears but tihar has no hangman

Anil Baijal, Arvind Kejriwal, Usha Devi, Nirbhaya, mercy plea, Ramnath Kovind, Nirbhaya gang-rape case, Tihar jail, Nirbhaya convicts in Tihar, Nirbhaya convicts, Delhi, Crime

Nirbhaya convicts execution seems imminent. Tihar officials are a worried lot as the jail doesn't have a hangman. The convicts could be hanged any day after the court issues a "Black Warrant" sanctioning their execution.

ITEMVIDEOS: నిర్భయ నిందితులకు ఉరి.. తలారీ ఏరీ..?

Posted: 12/03/2019 03:30 PM IST
Nirbhaya case execution nears but tihar has no hangman

దేశరాజధాని న్యూఢిల్లీలో జరిగిన వైద్యవిద్యార్థిని నిర్భయ దారుణ సామూహిక హత్యచార కేసు పెను సంచలనంగా మారి.. ఏకంగా దేశరాజధానిలోని షీలాదీక్షిత్ ప్రభుత్వాన్ని కూడా మార్చడానికి కారణమైంది. దేశంలో ఈ తరహా కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో పాటు కొత్త చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చిందీ ఘటన. అంతేకాదు ఆడవారిపై అకృత్యాలకు పాల్పడే నిందితుల వయస్సును కూడా తగ్గిస్తూ చట్టసభలు సవరణలు తీసుకువచ్చేలా చేసిందీ ఘటన. అయితే ఈ ఘటనలోని నిందితులకు మాత్రం ఇంకా ఉరి శిక్ష అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని మృతురాలి తల్లి ఉషాదేవి అరోపిస్తున్నారు.

ఈ తరుణంలో నిర్భయ దోషులకు వచ్చే నెలలో ఉరి శిక్ష అమలు చేయనున్నారు జైలు అధికారులు. ఇప్పటి వరకూ దోషులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఆమోదానికి నోచుకోలేదు. దీంతో తీహార్ జైలు అధికారులు వీరిని ఉరి తీయడానికి సమయం దగ్గర పడిందని అంటున్నారు. తాజాగా దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాబిక్ష పెట్టుకోగా.. ప్రెసిడెంట్ కార్యాలయ దానిపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఆ ప్రక్రియను పూర్తి చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నివేదిక ఇవాళ తమకు అందిందని, దానిని వెంటనే రాష్ట్రపతి కార్యాలయానికి పంపుతామని సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో తెలిపింది.

ఇదిలావుంటే.. తీహార్ జైల్లో ఉరిని అమలు చేయాల్సిన తలారి లేడట. అది ఓ పెద్ద సమస్యగా మారిందని, జైలు అధికారులు అంటున్నారు. కోర్టు నుంచి దోషుల ఉరితీతకు సంబంధించి, అనుమతులిస్తూ, 'బ్లాక్ వారెంట్' జారీ అయిన తరువాత ఏ రోజైనా వారిని ఉరి తీయవచ్చని, చివరిగా వారు రాష్ట్రపతికి పెట్టుకునే అర్జీని కొట్టివేస్తే, ఆపై కోర్టు బ్లాక్ వారెంట్ ను ఇస్తుందని జైలు అధికారి ఒకరు తెలిపారు. జైలులో తలారి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను కోరామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles