Woman to ride solo, intends to cover 3200kms వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ నిర్ధేశం.. ‘‘బహిరంగ ఉరే సరి..’’

Hyderabad disha case woman to ride solo intends to cover 3200kms

Priyanka reddy, veterinary doctor, disha, Neetu Chopra, Udaipur, independent, Balotra, Rajasthan, Kanyakumari, fight against rapists, CM Ashok Gehlot, Priyanka reddy murder, priyanka reddy lorry drivers, priyanka reddy veterinary doctor, crimes against women, Telangana, Crime

After Nirbhaya, the second shocker was veterinarian rape and murder case that has shocked the nation. Giving out the message that women should not be forced to stay indoors, a young Rajasthani woman will ride solo on her scooter to Kanyakumari, a 3,200-km journey

‘దిశ’ సందేశం.. స్వతంత్రంగా బయటకు.. ఒంటరిగా ఎదుర్కోనుటకు..

Posted: 12/03/2019 02:58 PM IST
Hyderabad disha case woman to ride solo intends to cover 3200kms

వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసు ఘటనపై ఉదయ్ పూర్ కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా విభిన్నంగా స్పందించారు. ‘దిశ’ హంతకులను తీవ్రవాదులుగా పరిగణించిన అమె.. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి, మహిళలను ఇంటికే పరిమితం చేసే అనాది రోజులకు మహిళను బలవంతంగా తోస్తున్నారని అరోపించారు. రేపిస్టులను ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కోనేందుకు మహిళ స్వతంత్రగా బయటకు రావాల్సిన అవసరం వుందని అన్నారు. భేటీ బచావ్.. భేటీ పడావ్ అన్న సూక్తులకు ఇక కాలం చెల్లిందని అన్నారు.

ఇకపై మహిళలు స్వతంత్రంగా బయటకు రావాలని, తమపై జరిగే నేరాలపై హెల్ప్ లైన్లకు ఫోన్ చేయడం బదులు.. ధైర్యంగా ఎదుర్కోవాలని.. మహిళ తన బలమేంటో తాను తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఈ రాజస్తాన్‌ యువతి అంటోంది. మహిళలకు ధైర్యాన్నిస్తూ రాజస్తాన్ లోని బలోత్రా నుంచి కన్యాకుమారికి 3,200 కిలోమీటర్లు ఆమె ఒంటరిగా స్కూటర్‌ ప్రయాణం చేయనున్నారు. ఇందుకోసం జైపూర్ లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ను కలవనున్నట్లు ఆమె చెప్పారు.

ఆదివారం జోధ్‌పూర్‌లో కేబినెట్‌ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసి తన మిషన్‌ గురించి తెలియజేశారు. తనను తాను సైనికురాలిగా భావిస్తున్నానని, ఒంటరిగా ప్రయాణించడానికి భయపడనని అన్నారు. తాను ఒంటరిగా వెళ్లడానికి నిర్ణయించుకున్నానని, మధ్యలో వెను​కడుగు వేయబోనని నీతూ చోప్రా స్పష్టం చేశారు. ఇకపై మహిళలు ఒంటరిగా, స్వతంత్రంగా, ధైర్యంగా బయటకు రావాలనే తాను సందేశమిస్తూ ప్రయాణం చేయనున్నానని ఎన్సీసీ క్యాడెట్ చోప్రా తెలిపారు. ‘దిశ’ హంతకులను వ్యతిరేకంగా పోరాడటమే తన మిషన్‌ లక్ష్యమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka reddy  Disha  veterinary doctor  Neetu Chopra  Udaipur  independent  Balotra  Rajasthan  Kanyakumari  Crime  

Other Articles