priyanka murder case accused in police custody? చిక్కిన ప్రియాంక నిందితులు.. ఆ రాత్రి ఏం జరిగిందీ.?

Priyanka murder case accused in police custody

veterinary doctor murdered and burnt, burnt body of woman vet, Priyanka reddy murdered, Priyanka reddy burnt, priyanka reddy accused, priyanka reddy lorry drivers, priyanka reddy veterinary doctor, chatanpally village, madhapur, shadnagar, lorry drivers, scooty, rachakonda police, Telangana, Crime

The Cyberabad police progressed in abduction, gangrape, murder and burnt body of a Priyanka Reddy, 26, a veterinary doctor, near Chatanpally village of Shadnagar.

పోలీసులకు చిక్కిన ప్రియాంక నిందితులు.. ఆ రాత్రి ఏం జరిగిందీ.?

Posted: 11/29/2019 11:51 AM IST
Priyanka murder case accused in police custody

సంచలనం సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక హత్య కేసులో ముందస్తు చర్యలు తీసుకోవడంలో శంషాబాద్ పోలీసులు పూర్తిగా విఫలమ్యారని విమర్శలు వెల్లువెత్తి.. తెలుగు రాష్ట్రాలలో ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు ఈ కేసు చేధనను సవాల్ గా తీసుకున్నారు. దీంతో 24 గంటలు కూడా తిరగకముందే ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరిని రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.

తొలుత అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్లు ఈ దారుణానికి ఒడిగట్టారని భావించిన పోలీసులు.. ఆ తరువాత సాంకేతిక ఆదారాలను పరిశీలించి.. నలుగురు నిందితులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారేనని గుర్తించినట్టు సమాచారం. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరోకరి కోసం గాలింపు చపట్టారు. పోలీసుల అదుపులో వున్న నిందితులు ప్రియాంక తన వాహనాన్ని పార్కు చేసి వెళ్లిన సమయంలో గమనించి.. ఆమె తిరిగి వస్తుందని.. ఈ క్రమంలో అమె వాహనాన్ని పంక్చర్ చేసి.. దానిని పంక్చర్ వేయిస్తామన్న నాటకంతో పథకం ప్రకారమే అమెను అపహరించారు.

అయితే వీరిని పట్టించింది మాత్రం ప్రియాంకా రెడ్డి వినియోగించిన స్కూటీ. స్కూటీ పంక్చర్ కావడంతో ఇంటికి తిరిగి వెళ్లే మార్గం లేక ఛటాన్ పల్లి టోల్ గేట్ వద్ద ఆగింది ప్రియాంక. అయితే స్కూటీని పంక్చర్ చేయిస్తానని చెప్పిన ఓ యువకుడు దుకాణాలు మూసివున్నాయని తిరిగి వచ్చేశాడు. మళ్లీ కొంత సేపటికి వచ్చి మరో వైపు ప్రయత్నిస్తానని తీసుకెళ్లాడు. ఆ తరువాత జరిగిందేంటి.? ఆ స్కూటీ ఏమైంది. ఆమెకు పంక్చర్ చేసి ఇస్తానన్న స్కూటీని తిరిగిఇచ్చేశాడా.? లేదా స్కూటీ పేరుతో అమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడా.? అన్న ప్రశ్నలు రేకెత్తున్నాయి.

ఈ క్రమంలో ప్రియాంక కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గా వద్ద నంబరు ప్లేటు లేని స్కూటీ కనిపించింది. దానిపై ఆరా తీయడంతో అది ప్రియాంక స్కూటీని గుర్తించారు పోలీసులు. దీంతో పంక్చర్ అయిన ప్రియాంక స్కూటీ ఇక్కడి ఎలా వచ్చింది.? సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు స్కూటీని నెట్టుకుని రావడం కష్టం. అంటే ఇది లారీ డ్రైవర్ల పనేనని అనుమానించారు పోలీసులు. దీనికి తోడు నెంబర్ ప్లేట్ తొలగించి వుండటం వారి అనుమానాలకు బలాన్ని చేకూర్చింది.

దారుణానికి ఒడిగట్టిన తరువాత నిందితులు కావాలనే నంబరు ప్లేటును తొలగించి స్కూటీని పదిహేను కిలోమీటర్ల అవతల వదిలి వయేడం.. కావాలనే కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్కూటీ కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లారీ నంబరు ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ అదుపులో వున్నది నిందితులేనా అన్న విషయాన్ని విచారిస్తున్నారని సమాచారం. కాగా, ఈ కేసులో రాత్రి పది గంటల సమయంలో ఫోన్ స్విచ్ఛాప్ అయిన తరువాత ప్రియాంక ఎక్కడెకెళ్లింది.? ఎలా కిడ్నాప్ కు గురైందన్న వివరాలను పోలీసులు మీడియాకు తెలుపనున్నారు.

పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అమె బౌతికంగా మరణించింది. అయితే రాత్రి పది గంటలకు అమె కిడ్నాప్ అయిన తరువాత చనిపోయిన మూడు గంటల వరకు దాదాపుగా ఐదు గంటల పాటు ఎలాంటి నరకం అనుభవించిందో.. పైశాచిక మృగాళ్ల కామదాహానికి ఎలా విలవిలలాడిందో.. తనను కాపాడమని ఎన్ని అర్థనాదాలు పెట్టిందో.. అమె ఆక్రందనలను కనీసం దేవుడైనా ఆలకించలేదా.? అన్న ప్రశ్నలు సర్వత్రా వినబడుతున్నాయి. ఇదిలావుండగా, నిందితులను వెంటనే, కఠినంగా శిక్షించాలని అమె తల్లిదండ్రులు కొరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles