Reliance Jio to raise prices in few weeks ఎయిర్ టెల్, వోడాఫోన్ బాటలోనే జియో..

Jio says will increase tariffs in next few weeks in compliance with rules

Reliance Jio, Reliance Jio plan, Reliance Jio service plan, Reliance Jio service price, Reliance Jio price hike, Reliance Jio tarrif plan, airtel, airtel service plan, airtel service price, airtel price hike, vodafone service plan, vodafone price hike, airtel broadband, airtel broadband plans, airtel broadband plans price, airtel dth plans, airtel dth plans price, airtel postpaid plans, airtel prepaid plan, airtel price hike, airtel price increased, airtel news, vodafone news, vodafone plans price, vodafone price increased, Business, Economy

Reliance Jio said it will increase mobile phone call and data charges in the next few weeks in compliance with rules, as it followed similar announcements by Bharti Airtel and Vodafone Idea on tariff hike.

ఎయిర్ టెల్, వోడాఫోన్ బాటలోనే జియో.. కస్టమర్లకు షాక్..

Posted: 11/20/2019 12:33 PM IST
Jio says will increase tariffs in next few weeks in compliance with rules

టెలికాం రంగంలో ఉచితాలతో సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ జియో కూడా తాజాగా ఎయిర్ టెల్, వొడాఫోన్ బాటలోనే పయనిస్తోంది. ఇటీవల కాలంలో తమ నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్కులకు చేసే కాల్స్ పై నిమిషానికి ఆరు పైసల మేర చార్జీలను మోపుతున్నామని ప్రకటించిన జియో, తాము కూడా టెలికాం రంగంలో అధికభారాన్ని మోస్తున్నామని చెప్పంది. దీంతో తాము కూడా తమ కస్టమర్లపై కొద్దిగా భారం వేయకతప్పడం లేదని ప్రకటించింది. ఎయిర్ టెల్, వోడాఫోన్ టెలికాం కంపెనీల తరహాలోనే ఈ డిసెంబర్ మొదలు కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టేందుకు సిద్దమయ్యింది.

డిసెంబర్ 1 నుంచి తమ టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనాన్ని సృష్టించింది. 'ఉచిత' వాయిస్ కాల్స్ తో పాటు పలు నెలల పాటు ప్రైమ్ సభ్యులకు ఉచిత డేటాను కూడా అందించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేకమంది స్మార్ట్ ఫోన్ వినయోగదారులు తమ నెట్ వర్క్ ను జియోకు మార్చుకున్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే కోట్లాదిమంది ఖాతాదారులను సంపాదించుకుంది. టెలికాం రంగంలో తమ కంపెనీ భారాన్ని మోస్తోందని,

ఇటీవలే వాయిస్ కాల్స్ పై చార్జీలు వేసిన రిలయన్స్ జియో.. ప్రత్యర్థి కంపెనీలైన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ బాటలోనే పయనిస్తోంది. తమ రిలయన్స్ జియో కూడా రానున్న కొన్ని వారాల్లోనే టారిఫ్ ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే జియో ఈ ప్రకటన చేయడం గమనార్హం.

కాగా, జియో ఇప్పటికే నాన్-జియో కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసల చొప్పున వసూలు చేస్తోంది. ఇప్పుడు మొబైల్ చార్జీలు కూడా పెంచితే ఖాతాదారుల జేబులకు చిల్లులు పడడం ఖాయం. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు, పరిశ్రమను బలోపేతం చేసేందుకు ట్రాయ్ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. డేటా వినియోగం, డిజిటలైజేషన్‌కు ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా మరికొన్ని వారాల్లో తాము కూడా టారిఫ్‌ను పెంచుతామని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles