TSRTC strike creates new record కొత్త రికార్డులను అందుకున్న టీఎస్ఆర్టీసీ సమ్మె

Section 144 crpc imposed in wake of bus roko call by tsrtc employees

TSRTC Workers, High Court, Avula Naresh, Mahabubabad, RTC MD Sunil sharma, RTC MD Sunil sharma Affidavit, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

In the wake of "Bus Roko" call given by the JAC of the striking employees of the TSRTC, Section 144 CrPC that prohibits assembly of more than 4 people in an area, has been imposed in all TSRTC depots across Hyderabad for November 16.

టీఎస్ఆర్టీసీ సమ్మె: రికార్డులను అందుకున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె.!

Posted: 11/16/2019 11:43 AM IST
Section 144 crpc imposed in wake of bus roko call by tsrtc employees

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో మరో రికార్డును అందుకుంది. తెలంగాణలో సుదీర్ఘకాలం పాటు చేపట్టిన సమ్మెగా టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె కొత్త రికార్డును నమోదు చేసుకుంది. నేటితో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఏకంగా 43 రోజులకు చేరకున్న తరుణంలో ఈ రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మె మాత్రమే 42 రోజుల పాటు సాగిన విషయం తెలిసిందే. ఆ రికార్డలను టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె అధిగమించడంతో సకల జనుల సమ్మెను బద్దలుకోట్టిన ఆర్టీసీ కార్మికులు నూతన రికార్డును అందుకున్నారు.

అయితే గతంలో పలు పర్యాయాలు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఉపక్రమించారు. సమ్మెను చేపట్టారు. అయితే ఎప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈ స్థాయికి చేరలేదు. 2001లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టగా 24 రోజుల పాటు కొనసాగింది. ఇక సకల జనుల సమ్మెలో కూడా ఆర్టీసీ కేవలం 17 రోజులు మాత్రమే సమ్మెను చేపట్టారు. కానీ తాము కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏకంగా రికార్డు స్థాయిని అందుకున్న సుదీర్ఘ సమ్మెగా రికార్డులకు ఎక్కడం గర్హనీయం. ఓ వైపు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలు, మరోవైపు మానసిక అందోళనలతో గుండెపోటుకు గురైన మరణాలు నమోదవుతున్నా..  తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను కనికరించడం లేదు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా క్రితంరోజు జరిగిన ఆందోళనల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్‌ శివారులోని తీగలగుట్టపల్లిలో కేసీఆర్‌ ఇంటిని ముట్టడించేందుకు కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్మికులు గేటు వద్దే బైఠాయించి ధర్నాకు దిగారు. అలాగే, నిజామాబాద్,  నిర్మల్‌, భైంసా డిపోల్లోకి వెళ్లిన కార్మికులు బస్సులను అడ్డుకునేందుకు యత్నించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. జేఏసీ నేతల ‘బస్ రోకో’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు  ఎక్కడికక్కడ 144 సెక్షన్‌ ను విధించాలని ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  Avula Naresh  Mahabubabad  Ashwathama Reddy  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles