Supreme Court clears way for Ram temple వివాదాస్పద స్థలం రామమందిరానికే: సుప్రీం తీర్పు

Sc orders centre to set up trust for temple construction allots alternate land for mosque

ayodhya verdict, ayodhya verdict reactions, ayodhya reactions, ayodhya supreme court verdict, ram temple verdict, ram temple verdict live, live ram temple verdict, ayodhya news, ayodhya case, ayodhya case verdict, ayodhya case live, ayodhya case news, ayodhya mandir, ram mandir, ayodhya ram mandir, babri masjid ayodhya, babri masjid, ayodhya ram mandir verdict, ayodhya mandir, ayodhya case, ram mandir live, ram mandir verdict

In a historic judgment, the Supreme Court has paved the way for the construction of a Ram Temple at the disputed site in Ayodhya and directed the Centre to allot a 5-acre alternate plot to the Sunni Waqf Board for building a mosque.

వివాదాస్పద స్థలం రామమందిరానికే: సుప్రీం తీర్పు

Posted: 11/09/2019 11:55 AM IST
Sc orders centre to set up trust for temple construction allots alternate land for mosque

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత సున్నితమైన అయోధ్యలో వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. బాబ్రీ మసీదుకు అధీనంలో వున్న వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిలో ఇక రామమందిర నిర్మాణం జరుపుకోవచ్చునని సుప్రీం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలంపై కేంద్ర ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం పలు సూచనలు చేసింది.

అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు.. ఆ 2.77 ఎకరాల స్థలాన్ని సుప్రీంకోర్టు.. రామమందిర నిర్మాణానికి అప్పగించింది. మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టు ఏర్పాటు చేయాలని చెప్పింది. మందిర నిర్మాణానికి ట్రస్టీల నియామకం, విధివిధానాలు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించింది. అదేశించింది. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లాం మూలాలు లేవని స్పష్టం చేసింది.

1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించారనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. వివాదాస్పద స్థలంపై హక్కులు, మత సామరస్యం, శాంతి భద్రతలకు లోబడి ఉంటాయని పేర్కొంది. అయితే ఈ భూమికి బదులుగా బాబ్రి మసీదుకు ఐదు ఎకరాల స్థలాన్ని అయోద్యలోని మరో ప్రాంతంలో అప్పగించాలని ఈ బాధ్యత కూడా ట్రస్టుదేనని న్యాయస్థానం అదేశాలను జారీ చేసింది.

సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు:

* వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామమందిరానికే
* సున్నీ బోర్డుకు ఐదు ఎకరాల అనువైన స్థలం కేటాయించాలి.
* 1993లో కేంద్రం స్వాధీనం చేసుకున్న భూమి నుంచి ఐదు ఎకరాలు కేటాయింపు
* భూమి ఎక్కడ కేటాయించాలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలి.
* వివాదాస్పదమైన స్థలాన్ని పంచే ప్రసక్తే లేదు.
* వివాదాస్పద స్థలం రాంలాలాకే చెందుతుంది

134 సంవత్సరాలుగా వివాదంలో ఉంది రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూమి. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమించిన భారమవగా.. ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles