Rudraveena songs are wake-up call for YSRCP: JanaSena వైసీపీ నేతలకు ‘రుద్రవీణ’ పాటలే మేలుకోలుపు: పవన్ కల్యాణ్

Pawan kalyan tweets rudraveena song says it is a wake up call for ysrcp

Janasena, Pawan Kalyan, vishaka long march, pawan kalyan long march, janasena long march, building workers welfare fund, pawan kalyan deadline to government, pawan kalyan deadline to YSRCP government, pawan kalyan Long March deadline to government, Mangalagiri, Amaravati, andhra pradesh, politics

Jana Sena chief Pawan Kalyan takes a dig at YSRCP leaders who criticized his Long March, tweeted the songs from his brother Chiranjeevi's movie Rudraveena. He believed the songs would be an awakening call for the YSRCP leaders.

వైసీపీ నేతలకు ‘రుద్రవీణ’ పాటలే మేలుకోలుపు: పవన్ కల్యాణ్

Posted: 11/08/2019 09:24 PM IST
Pawan kalyan tweets rudraveena song says it is a wake up call for ysrcp

అసంఘటిత భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతూ వారిని రోడ్డున పడేస్తుందంటూ విశాఖ లాంగ్ మార్చ్ లో విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ తరువాత కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భవన నిర్మాణరంగాన్ని నమ్ముకుని బతుకుతున్న లక్షలాదిమంది కార్మికులు, కూలీలు జీవితాలతో ఈ సమస్య ముడిపడిందని అవేదన వ్యక్తం చేసిన ఆయన తాజాగా ఇదే సమస్యపై వైసీపీ నేతలను రుద్రవీణ పాటలైనా మేలుకోల్పాలని అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు ఆయన తాజాగా చేసిన ట్వీట్ లో పేర్కోన్నారు. విశాఖలో లాంగ్ మార్చ్ ‌విజయవంతమైన తర్వాత, ఫుల్‌‌జోష్‌లో కనిపిస్తున్నట్టున్న జనసేనాని.. గెలుపోటములు కేవలం పాసింగ్ క్లౌడ్స్ అని.. తన, తన పార్టీ సిద్ధాంతాలు అమలు జరిగినప్పుడే నిజమైన విజయమని అభిప్రాయపడే పవన్ కల్యాణ్ తాజాగా.. ట్విట్టర్‌లో వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవికాస్తా వ్యంగ్యాస్త్రాలుగా సంధించారు. వైసీపీ నేతలకు, రుద్రవీణ పాటలైనా మేల్కొల్పాలంటూ, పవన్ చేసిన ట్వీట్‌‌, సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

ఇంతకీ ట్విట్టర్‌లో పవన్‌ రుద్రవీణ ట్వీట్ ఏంటంటే, 'రుద్రవీణ... నాకు స్ఫూర్తిని ఇచ్చే చిత్రం. భవన నిర్మాణ కార్మికులు రోజువారీ కూలి దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా జీతభత్యాలు తీసుకొంటున్న వైసీపీ నేతలకు రుద్రవీణలోని పాటలు మేలుకొలుపు'' అని అన్నారు పవన్‌. దీనికి 'చుట్టూ పక్కల చూడరా...' అన్న పాటను యాడ్ చేశారు జనసేనాని. మరో ట్వీట్‌లో... ''వైసీపీ మ్యానిఫెస్టోకు, వారి వాగ్దానాలకు ఓటేసిన ప్రజల కళ్లు తెరిపించే పాట మరోటి ఉంది. వాస్తవంగా హామీల అమలు పరిస్థితిని అది అద్దంపడుతుంది'' అన్నారు పవన్. దానికి 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ...' అన్న సాంగ్‌ను యాడ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan Kalyan  Long march  deadline  YSRCP Government  vishakapatnam  andhra pradesh  politics  

Other Articles