Devendra Fadnavis resigns as Maharashtra CM మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నావిస్ రాజీనామా.!

Devendra fadnavis resigns as cm blames shiv sena for deadlock in maharashtra

devendra fadnavis, devendra fadnavis resigns, fadnavis resigns, maharashtra chief minister, maharashtra, maharashtra politics, bjp, shiv sena, fadnavis quits, BJP, Shiv Sena, NCP, Congress, Maharashtra government formation, Devendra Fadnavis, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Maharashtra Assembly Polls 2019, Current Affairs, India, Maharashtra, Politics

Devendra Fadnavis resigned as the chief minister of Maharashtra on Friday ahead of the deadline ends for all parties to stake claim to form the government in the state.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నావిస్ రాజీనామా.!

Posted: 11/08/2019 07:20 PM IST
Devendra fadnavis resigns as cm blames shiv sena for deadlock in maharashtra

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఈ క్రమంలో 54 సీట్లను గెలుచుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో శివసేన నేతలు భేటీ కావడం.. బీజేపికి శివసేన పెట్టిన షరతునే శరద్ పవార్ కూడా పెట్టడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోకి శివసేన నెట్టివేయబడిందన్న వార్తులు వినిపిస్తున్నాయి.

కాగా, ఇవాళ అర్థరాత్రితో మహారాష్ట్రలోని గత బీజేపి ప్రభుత్వం పదవీకాలం ముగుస్తుందన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల షెడ్యూల్డు విడుదలైన నాటి నుంచి మహారాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రిగా కోనసాగుతూ వస్తున్న ఫడ్నావిస్ గత ప్రభుత్వ పదవికాలం ముగియడం.. ఇవాళ రాజీనామా చేశారు. అయితే ఆయనను మరికొంతకాలం పాటు అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తారన్ని వార్తలు వినబడినా.. శివసేన మాత్రం ఫడ్నావిస్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

మహారాష్ట్రలో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా బీజేపి అవతరించినా.. మరో పార్టీ సహకారం లేకుండా అధికార పగ్గాలను చేపట్టే అవకాశం లేకపోవడం శరాఘతంగా పరిణమించింది. ఎన్నికలకు ముందు తమకు బీజేపి ఇచ్చిన మాటకు కట్టుబడి చెరో రెండున్నరేళ్ల కాలం పాటు అధికారాన్ని అనుభవించేందుకు సిద్దం అయితేనే తాము బీజేపితో కలసి నడుస్తామని శివసేన తేల్చిచెప్పడంతో.. ఆయన రాజీనామను సమర్పించారు.

తన మంత్రులతో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి రాజీనామాను సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ తన ఐదేళ్ల పాలనలో సహకరించిన సహచర పార్టీ నాయకులు, శివసేన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రపతి పాలన విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Shiv Sena  NCP  Congress  devendra fadnavis resigns  Governor  Bhagat Singh Koshyari  Maharashtra  Politics  

Other Articles