Gadkari in Mumbai, but says won't meet any politician మహారాష్ట్ర: అధికార పంఫిణీపై బెట్టువీడని బీజేపి, శివసేన

Don t misuse provision of caretaker govt shiv sena warns bjp

BJP, Shiv Sena, Maharashtra government formation, Devendra Fadnavis, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, Assembly Elections 2019, Maharashtra Assembly Polls 2019, Current Affairs, India, Maharashtra, Politics

The Shiv Sena today remained firm on its demand for sharing the chief minister's post in Maharashtra and asked the BJP not to misuse the provision of "caretaker" government to remain in power in the state.

మహారాష్ట్ర: అధికార పంఫిణీపై బెట్టువీడని బీజేపి, శివసేన

Posted: 11/08/2019 11:39 AM IST
Don t misuse provision of caretaker govt shiv sena warns bjp

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ నెల 9 శనివారంతో గత ప్రభుత్వ పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నావిస్ ఆపధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించడమా.? లేక రాష్ట్రపతి పాలన విధించడమా.? అన్న విషయామై దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కాగా బీజేపి ఎన్నికలకు ముందు తమకిచచిన మాటకు కట్టుబడి రెండున్నరేళ్లు అధికారం పంచుకోవడానికి సిద్దపడితేనే తమతో చర్చలకు సంప్రదించాలని శివసేన తెగేసి చెప్పడంతో.. పీఠముడి చిక్కువీడటం లేదు. దీంతో నిన్నటి వరకు మిత్రపక్షంగా ప్రజల్లోకి వెళ్లిన పార్టీలు నేడు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో శివసేన ముఖ్యనేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనుకోవడం ప్రజల్ని, ప్రజాతీర్పును అగౌరపరచడమేనని అభిప్రాయపడ్డారు.  అపద్ధర్మ ప్రభుత్వం పేరుతో బీజేపి అధికార దుర్వినియోగం చెయ్యొద్దన్నారు. పదవీకాలం ముగియనుండటంతో ఫఢ్నావీస్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపిపైనే ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత ఉందన్నారు. ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసి కావాలంటే బలనిరూపణకు నెలరోజుల సమయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు. మరోవైపు అధికారిక పత్రిక సామ్నాలో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి బీజేపియే కారణమని విమర్శించింది.

బీజేపి ట్రబుల్ షూటర్ గా మారిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. మహాసంక్షోభాన్ని తనదైనశైలిలో పరిష్కరించేందుకు రంగంలోకి దిగనున్నారు. ఇవాళ ఆయన ముంబైకి చేరుకోనున్నారు. ఈ విషయమై క్రితం రోజున అర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ తో ఇప్పటికే సమావేశమైన ఆయన.. ఇవాళ శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రేతో భేటీకానున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. దీనిపై స్పందించిన సంజయ్ రౌత్.. శివసేనకు సీఎం పదవి ఇచ్చే హామితో రాయభారం చేస్తే తమకు అభ్యంతరం లేదని, అలాకానీ పక్షంలో ఆయన పర్యటనను శివసేన సాధారణ పర్యటనగానే భావిస్తుందని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles