Bulbul likely to turn into a very severe cyclonic storm పెను తుఫానుగా మారనున్న బుల్ బుల్.. తీరం అప్రమత్తం

Cyclone bulbul likely to turn very severe over next 2 days

cyclone bulbul, Coastal Andhra Pradesh, Cyclone Bulbul, Cyclone Bulbul west bengal, west bengal Cyclone Bulbul, Odisha Cyclone Bulbul,Cyclone Bulbul bangladeh, copndition of Cyclone Bulbul, Telangana, bay of bengal, Telugu states rainfall, Rain in Telangana, Rain in Andhra Pradesh, Telangana, Andhra Pradesh, Politics

Cyclone Bulbul, which lay around 930 km south- southeast of Kolkata, "might turn into a severe cyclonic storm by Thursday midnight and further intensify into a very severe cyclonic storm by Saturday evening", leading to rough sea conditions, an IMD official said.

పెను తుఫానుగా మారనున్న బుల్ బుల్.. తీరం అప్రమత్తం

Posted: 11/07/2019 06:57 PM IST
Cyclone bulbul likely to turn very severe over next 2 days

తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాటు వీడటం లేదు. వర్షాకాలంలో ఆలస్యంగా తెలుగురాష్ట్రాలపై కరుణ చూపిన వర్షాలు.. ఇక చాలు అన్నా వరుణుడు తన ప్రతాపాన్ని మాత్రం చాలించడం లేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతాయని మాత్రమే అంచనా వేసిన భారత వాతావరణ కేంద్రం.. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితిలోకి జారుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు, ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కురిసన వర్షాలు తెలుగు రాష్ట్రాలలోని అనేక లోతట్టు ప్రాంతాల ముంపుకు గురిచేశాయి.

అది చాలదన్నట్లు ఒక తుఫాన్ ప్రభావం పోకముందే మరో తుఫాన్ దూసుకొస్తూ తీర ప్రాంతాలను వణికిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు అరేబియా సముద్రం నుంచి తీరం వైపు కదులుతూ వచ్చిన మహా తుఫాన్ ప్రభావంతో దక్షిణాదిన పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవగా తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చింది. మరో 24 గంటల్లో తుఫాన్‌గా మారి, నవంబర్ 9 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిషా వైపు నుంచి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు పయణిస్తోన్న ఈ తుఫాన్‌కు బుల్‌బుల్ అని నామకరణం చేశారు.

ప్రస్తుతం అండమాన్ దీవులకు పశ్చిమ వాయవ్య దిశగా 390 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. బుల్ బుల్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ తీర ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలోనూ అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ సర్కార్ సైతం బుల్‌బుల్ తుఫానుపై అప్రమత్తతో వ్యవహరిస్తోంది.

వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 14 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించిన ఒడిషా సర్కార్.. ఎప్పటికప్పుడు తుఫాన్ కదలికలను గమనిస్తూ పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆ 14 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. బుల్‌బుల్ తుఫాన్‌పై ఒడిషా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా మీడియాతో మాట్లాడుతూ.. 'బుల్‌బుల్ తుఫాన్ ఒడిషా తీరాన్ని తాకకుండా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంవైపు వెళ్లవచ్చు కానీ తుఫాన్ ప్రభావంతో ఉత్తర ఒడిషాలోని తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles