Telangana High Court Upset again with RTC Affidavit సయోధ్యకు ఆర్టీసీ, ప్రభుత్వం కలసిరావడం లేదన్న హైకోర్టు

Tsrtc strike high court orders chief secretary to explain on affidavits filed by rtc and govt

TSRTC Workers, High Court, RTC MD Sunil sharma, RTC MD Sunil sharma Affidavit, RTC MD affidavit, High court urges workers to call off strike, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

Telangana High court has expressed unhappiness over the affidavitత filed by TSRTC Management and State finance ministry over the financial position of the RTC. During the hearing High court notices that the affidavits filed in this case are quite opposite, orders Cheif Secretary to explain on this reports.

టీఎస్ఆర్టీసీ సమ్మె: సయోధ్యకు ఆర్టీసీ, ప్రభుత్వం కలసిరావడం లేదన్న హైకోర్టు

Posted: 11/07/2019 01:34 PM IST
Tsrtc strike high court orders chief secretary to explain on affidavits filed by rtc and govt

తెలంగాణ ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ మీద ఈ నెల 1వ తేదీని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా అధికారుల తీరులో మాత్రం మార్పు లేదు. దీంతో అధికారులపై న్యాయస్థానం మరోమారు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే అది ధిక్కారణ కిందకు వస్తుందని తెలియదా.? అని నిలదీసిన న్యాయస్థానం మీ సమాచారంతో సీఎం, కేబినెట్, ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.

ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన విచారణలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అర్థికశాఖతో పాటు ఆర్టీసీ యాజమాన్యం సమర్పించిన రెండు నివేదికలను పరిశీలించింది. దీంతో పాటు న్యాయస్థానం అదేశాల మేరకు ఆర్టీసీ స్థితిగతులపై ఇన్‌‌చార్జి ఎండీ సునీల్ శర్మ కూడా క్రితం రోజున అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటి బకాయి లేదని తేల్చిచెప్పింది. ఆర్థిక శాఖ అధికారులు, ఆర్టీసీ యాజమాన్యం సమర్పించిన నివేదికలు రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఐఏఎస్ అధికారులు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడిన న్యాయస్థానం.. వారిపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వచ్చిన పిటీషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ సాగింది. ఈ సందర్భంగా తప్పుడు నివేదికలు ఇస్తే, ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా? అని ప్రశ్నించింది. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలని సూచించింది. అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టు తెలిపింది. అయితే, ప్రభుత్వం, ఆర్టీసీ చిత్తశుద్ధితో ముందుకు రావట్లేదని చెప్పింది. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖల అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా లెక్కలు చెబుతున్నారని తెలిపింది. ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని పేర్కొంది. తమతో వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. మీ సమాచారంతో సీఎం, కేబినెట్, ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? అని నిలదీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  High Court  RTC MD Sunil sharma  Affidavit  Ashwathama Reddy  RTC Employees  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles