Shiv Sena accuses BJP of poaching MLAs మిత్రపక్ష ఎమ్మెల్యేలకు బీజేపి ఎర: శివసేన అరోపణ..

Maharashtra power tussle shiv sena accuses bjp of poaching mlas

BJP, Shiv Sena, Maharashtra government formation, Devendra Fadnavis, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, Assembly Elections 2019, Maharashtra Assembly Polls 2019, Current Affairs, India, Maharashtra, Politics

As the power tussle between Shiv Sena and BJP continues in Mahrashtra, the Shiv Sena on Thursday made another shocking statement claiming that its ally BJP is poaching MLAs.

మిత్రపక్ష ఎమ్మెల్యేలకు బీజేపి ఎర: శివసేన అరోపణ.. సామ్నలో సంపాదకీయం

Posted: 11/07/2019 12:55 PM IST
Maharashtra power tussle shiv sena accuses bjp of poaching mlas

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ తరుణంలో బీజేపిపై మిత్రపక్ష కూటమి శివసేన సంచలన అరోపణలు చేసింది. నీతి, న్యాయం, ధర్మం నాలుగు పాదాలపై నడిపిస్తామంటూ ప్రగల్భాలు పలికే బీజేపి.. తెరవెనుక మాత్రం అత్యంత హేయకరమైన పనులకు శ్రీకారం చుడుతుందని అరోపించింది. చివరకు ఈ అన్యాయమైన చర్యలు ఎంతవరకు దిగజారాయంటే.. తమ మిత్రపక్ష ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలోకి లాక్కునేందుకు ఎరగా అక్రమ మార్గాల ద్వారా ఆర్జించిన అవినీతి సోమ్మును పెద్ద ఎత్తున చూపుతున్నారని దుయ్యబట్టింది.

శివసేన సొంత పత్రిక సామ్నాలో ఈ మేరకు సంపాదకీయాన్ని ప్రచురించింది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీకే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రజలు తీర్పు చెప్పారనీ... అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. ‘‘కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ధన బలంతో గెలుచుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రోజు రోజుకూ ఈ ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర రాజకీయ విలువలను దిగజార్చే ఇలాంటి చర్యలను శివసేన సహించబోదు..’’ అని ఆ పార్టీ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం రైతులకు సాయం చేయకపోవడం వల్లే శివసేన నేత సీఎంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది.

ఇదివరకే సామ్నా సంపాదకీయంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనపై కూడా కథనాన్ని ప్రచురించింది శివసేన. బీజేపికి చెందిన కీలక నేత సుధీర్.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి కొనసాగుతన్న నేపథ్యంలో దానిని ఈ నెల లోగా పరిష్కరించుకోవాలని.. లేని పక్షంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు వున్నాయిని వ్యాఖ్యలు చేసిన క్రమంలో శివసేన ధీటుగా స్పందించింది. రాష్ట్రపతి బీజేపి నియంత్రణలో వున్నారా.? లేక రాష్ట్రపతి స్టాంపు బీజేపి కార్యాలయంలో వుందా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును గౌరవించాలన్న విషయాన్ని అధికార పార్టీ విస్మరించడం సమంజసం కాదని చురకలంటించింది.

శివసేన ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ‘‘మాకు ఆ అవసరమే లేదు. మా ఎమ్మెల్యేలంతా పార్టీకి కట్టుబడి ఉన్నారు. ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తున్న వాళ్లు ముందు తమ ఎమ్మెల్యేల గురించి జాగ్రత్త పడితే మంచిది..’’ అని పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ బయటికి వెళ్లే ప్రసక్తే ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మధ్య ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని కూడా రావత్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles