Smart Elephant Found A Way To Cross An Electric Fence తెలివైన గజరాజుకు నెటిజన్ల సలామ్.. విద్యుత్ తీగను దాటేసి మరీ..

Smart elephant breaks electric fence like it s no big deal wins netizens

elephant crosses electric fence, elephant video, Susanta Nanda, Indian Forest service officer, social media, netizens, viral video, smart elephant

Elephants are among the most intelligent beings in the animal kingdom. From time to time, humans get the essence of their intelligence in different clips shared by forest officers, rangers and people on safari trips.

తెలివైన గజరాజుకు నెటిజన్ల సలామ్.. విద్యుత్ తీగను దాటేసి మరీ..

Posted: 11/05/2019 07:58 PM IST
Smart elephant breaks electric fence like it s no big deal wins netizens

ఏనుగులు ఎంత తెలివైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతా నందా ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెటజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆ వీడియోలో..ఓ ఏనుగు కరెంటు తీగలు చుట్టిఉన్న కంచె అడ్డుగా నిలుస్తుంది. ఇతర జంతువులతే..కంచె తాకి షాక్ తిని ఉండేవి..లేకపోతే..కంచె వైపు కన్నెత్తి కూడా చూడకుండా మరోవైపు పారిపోయేవి.
 
మరి ఈ గజరాజేమో చాలా తెలివైనది. అడ్డంకులను ఎలా తొలగించాలో దానికి స్పష్టంగా తెలుసు. అందుకే కరెంట్ ప్రసరిస్తున్న తీగలను అది తాకలేదు. అందుకు బదులుగా ఆ తీగలు చుట్టిఉన్న చెక్క స్తంభాలను పెకలించి వేసింది. అత్యంత జాగ్రత్తాగా.. ఏమాత్రం కరెంటు తీగలకు తాకకుండా ఈ వ్యవహారాన్నంతా చక్కబెట్టింది. దీంతో  స్తంభాలతో పాటుగా కరెంటు తీగలు కూడా దారిలోంచి తొలగిపోయాయి. ఆ తరువాత ఎంచక్కా తన మానాన తాను గమ్యం దిశగా తరలిపోయింది. ఈ వీడియో చూసి నెటిజన్లు..ఏనుగు తెలివికి అబ్బురపడుతున్నారు. గజరాజుకు తల వంచి సలామ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles