Dollar seshadri continues to work in TTD టీటీడీలో డాలర్ శేషాద్రిని సేఫ్.. జగన్ సర్కార్ జీవో వర్తంచదా..?

Ap govt go 2323 not applicable to dollar seshadri continues in ttd

Tirumala Tirupati Devasthanam, TTD Board, Dollar Seshadri, outsourcing staff, TTD Executive Officer, EO Anil Kumar Singhal, TTD chairman YV SubbaReddy, Tirumala, Andhra pradesh, Politics

The Jaganmohan Reddy government turned its focus on Tirumala Tirupati Devasthanam for weeding out the staff appointed during the previous Chandrababu Regime. It issued GO 2323 removing all those who retired before March 31 this year but continuing as contract or outsourcing staff in TTD.

టీటీడీలో డాలర్ శేషాద్రిని సేఫ్.. జగన్ సర్కార్ జీవో వర్తంచదా..?

Posted: 11/01/2019 01:03 PM IST
Ap govt go 2323 not applicable to dollar seshadri continues in ttd

ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్రంలో తమ ఉనికిని చాటాలని భావిస్తాయి. అందుకు అనుగూణంగా తమ అధిపత్యం స్పష్టంగా కనబడేలా నిర్ణయాలు తీసుకుంటాయి. రాష్ట్రంలోని అన్నిరంగాల్లో ఇది కామన్. అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇటీవల ఎన్నికలలో దారుణ ఓటమిని చవిచూసిన నేపథ్యంలో జగన్ సర్కార్ కూడా తమ అధిపత్యాన్ని అన్ని చోట్ల చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు సర్కార్ గతంలో పదవి విరమణ పొందిన టీటీడీ ఆలయ అర్చకుడు డాలర్ శేషాద్రిని తిరిగి నియమించారు. దీంతో ఆయన ఇప్పుడు మరోమారు టార్గెట్ అయ్యారు. దీంతో ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన ఉద్యోగులందరినీ పంపేయాలని నిర్ణయం తీసుకుంది.

అయితే ప్రభుత్వం ఇందుకుగాను జీవో 2323ను తీసుకువచ్చినా.. ప్రస్తుతం మాత్రం దీనిపై వెనక్కు తగ్గక తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ జీవో మేరకు.. పన్నెండేళ్ల కిందట రిటైరై… ఇప్పటికీ చక్రం తిప్పుతున్న డాలర్ శేషాద్రిని కూడా తొలగించడానికి టీటీడీ అధికారులు ఫైల్ ను సిద్ధం చేశారు. ఆయనను తొలగించాల్సిందేనని టీటీడీ అధికారులపై ఓ వర్గం తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసింది. ముఖ్యంగా టీటీడీలోకి రావాలనుకుంటున్న మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు మద్దతుగా ఉండే వర్గం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపైనే ఒత్తిడి పెట్టిందని ప్రచారం జరిగింది.

ప్రభుత్వం కూడా ఇక తొలగించినట్లేనని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు వచ్చిన సూచనల ప్రకారమే.. టీటీడీ అధికారులు ఫైల్‌ను సిద్ధం చేశారు. రాత్రికి.. వందమందికిపైగా అలా రిటైరై మరీ ఉద్యోగంలో కొనసాగుతున్న వారిని తొలగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. కానీ.. అందులో డాలర్ శేషాద్రి పేరు లేదు. 2006లో రిటైర్‌ అయినా ఇప్పటికీ పొడిగింపు తెచ్చుకుంటూ ఉన్నారు. గతంలో ఆయన పొడిగింపుపై కోర్టు కేసులు నమోదయ్యాయి. ఓ సారి డాలర్ శేషాద్రి నియామకం చెల్లదంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై డాలర్ శేషాద్రి సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ తర్వాత సుప్రీంకోర్టు డాలర్ శేషాద్రికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆయన టీటీడీలో కొనసాగుతున్నారు.

దీంతో డాలర్ శేషాద్రికి ఉన్న పలుకుబడి అర్థం చేసుకోవచ్చంటున్నారు. శ్రీవారికి జరిగే సేవల విషయంలో.. ఆయన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. ఆలయం గురించి.. శ్రీవారి పూజల గురించి.. ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని.. టీటీడీ వర్గాలే చెబుతూంటాయి. ఆయన రాకపోతే… పూజాకైంకర్యాలు చేసే వారిలో చాలా మందికి కాళ్లూ చేతులూ ఆడవు. బ్రహ్మోత్సవాలు వ్యవహారాలు మొత్తం ఆయనే దగ్గరుండి చేస్తారు. ఆయన సేవలు ఆయన కోరుకున్నంత కాలం.. కొనసాగుతాయని.. తాజా పరిణామాలే నిరూపిస్తున్నాయి. కాగా ఉద్వాసనకు గురైన వారి పూర్తి వివరాలు నేడు వెల్లడికానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles