setback to AP CM YS Jagan in CBI Court సీబిఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు చుక్కెదురు..

Setback to ap cm ys jagan in cbi court

YS Jagan, CBI, CBI Court, disproportionate assets case, Personal appearance, YSR Congress Party, Andhra Pradesh, Politics

In a major setback for Andra Pradesh Chief Minister and YSR Party Chief Jagan Mohan Reddy, the Central Bureau of Investigation (CBI) has not exempted him from personal appearance in connection with the probe in the disproportionate assets case.

సీబిఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు చుక్కెదురు..

Posted: 11/01/2019 11:58 AM IST
Setback to ap cm ys jagan in cbi court

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబిఐ కోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్థుల కేసులో అయనపై నమోదైన కేసుల విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పించేందుకు వేసిన పిటీషన్ ను న్యాయస్థానం కొట్టివేయడంతో ఆయనకు షాక్ తగిలింది. కేసు విచారణ నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. మినహాయింపు పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించింది.

ప్రస్తుతం తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నానని.. ఈ క్రమంలో తాను న్యాయస్థానానికి ప్రతీ వారం హాజరుకావడంతో.. రాష్ట్ర అధాయానికి గండి పడుతుందని ఆయన తన పిటీషన్ లో పేర్కోన్నారు. ఒక రోజు తాను కోర్టుకు వస్తే తన ప్రొటోకాల్, సెక్యూరిటీ కోసం రూ. 60 లక్షలు ఖర్చవుతుందని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, దీంతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చవుతుందని పిటిషన్ లో జగన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, కోర్టు విచారణనకు తన బదులు తన న్యాయవాది అశోక్ రెడ్డి హాజరవుతారని, వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని కోర్టును కోరారు.

అయితే, అక్రమాస్థుల కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న వైఎస్ జగన్.. గతంలోనే సాక్షులను ప్రభావితం చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని.. ఇక కేసు విచారణ నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు కల్పిస్తే.. దాని ప్రభావం సాక్షులపై పడుతుందని సీబీఐ వాదించింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు... వ్యక్తిగత మినహాయింపును ఇవ్వలేమని తెలిపింది. కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles