TSRTC strike: another RTC driver dies of heart attack టీఎస్ఆర్టీసీ సమ్మె: మరో డ్రైవర్ గుండెపోటుతో మృతి

Tsrtc strike another rtc driver krishnaiah goud dies of heart attack

TSRTC Workers, TSRTC Strike, RTC Driver, Krishnaiah Goud, Heart attack, Cardiac arrest,High Court, workers apology, RTC employees apologize, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

TSRTC Workers Strike demanding merger of RTC in Government continues on 26th day amid a panic incident. Another RTC driver Krishnaiah goud dies of Heart attack today.

టీఎస్ఆర్టీసీ సమ్మె: మరో డ్రైవర్ గుండెపోటుతో మృతి

Posted: 10/31/2019 12:27 PM IST
Tsrtc strike another rtc driver krishnaiah goud dies of heart attack

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తున్నారు. తమలాంటి సాధారణ ప్రజల ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఫ్రభుత్వం.. తమపైనే కొరడా ఝుళిపిస్తోందని మండిపడుతున్న కార్మికులు తమను తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న సమ్మె నేటితో 27వ రోజుకు చేరింది. ఈ నెల 5న ప్రారంభమైన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం మధ్యమధ్యలో చేస్తున్న కఠిన ప్రకటనలతో మనస్తాపం చెందిన పలువురు ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే అసువులు బాసారు.

ప్రభుత్వం దిగరాకపోవడం.. మరోవైపు కఠిన వైఖరిని అవలంబించి కార్మికుల ఉద్యోగాలు పోయినట్లేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పేర్కోన్న నేపథ్యంలో ఉద్వేగానికి గురైన పలువురు కార్మికులు బలవన్మరణాలకు పాల్పడగా, మరికోందరు గెండెపోటుకు గురవుతున్నారు. ఇంకోందరు కార్మికులను తోటి ప్రయాణికులు భగ్నం చేశారు. ఈ క్రమంలో ఇవాళ తాజాగా మరో ఆర్టీసీ కార్మికుడు ప్రాణాలు వదిలాడు. మహబూబ్ నగర్ డిపోకి చెందిన జి.కృష్ణయ్య గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ గురువారం ఉదయం 9.30గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు.

20ఏళ్లుగా కృష్ణయ్య గౌడ్ ఆర్టీసీలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన స్వస్థలం బండమీదిపల్లి. మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. ఇదిలా వుండగా, క్రితం రోజున సరూర్ నగర్‌లో నిర్వహించిన సకల జనుల భేరీ సభ సందర్భంగా కరీంనగర్‌కి చెందిన నంగునూరి బాబు అనే డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. బాబు మృతి చెంది 24గంటలు గడవకముందే మరో డ్రైవర్ మృతి చెందడం గమనార్హం. కృష్ణయ్య మృతితో మొత్తం ఇప్పటివరకు మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల సంఖ్య 17కి చేరింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles