16 dead as fire engulfs express train in Pakistan పాకిస్తాన్ రైలులో అగ్నిప్రమాదం.. 16 మంది అహుతి..

16 killed as fire engulfs express train in liaqatpur of pakistan

Liaqatpur, Liaqatpur fire, Liaqatpur fire killed, Liaqatpur death toll, Liaqatpur fire today, Liaqatpur Pakistan, Liaqatpur Pakistan fire, Pakistan train accident, Tezgam express accident, Pakistan train tragedy, Pakistan train accident toll, latest news on Pakistan train accident, Rawalpindi, Karach

At least 16 people were killed and 13 others suffered injuries as fire engulfed an express train in Liaqatpur near Rahim Yar Khan on Thursday morning, Pakistani media reported.

పాకిస్తాన్ రైలులో అగ్నిప్రమాదం.. 16 మంది అహుతి..

Posted: 10/31/2019 11:43 AM IST
16 killed as fire engulfs express train in liaqatpur of pakistan

పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 62 మంది అగ్నికి అహుతయ్యారని సమాచారం. వేగంగా వెళ్తున్న రైలులో అగ్నిప్రమాదం సంభవించడం.. రైలు కదులుతున్న వేగానికి మంటలు క్షణాల్లో వ్యాపించడంతో 62 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారని సమాచారం. ఆకస్మికంగా రేగిన మంటలు క్షణాల్లో వ్యాపించడంతో వాటిని గమనించి షాక్ లో వున్న ప్రయాణికులు తేరుకునే లోపే జరగరానీ ఘోరం జరిగిపోయిందని ఈ దుర్ఘటను నుంచి తప్పించుకున్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కరాచీ నుంచి లాహోర్ కు ఈ ఉదయం బయలుదేరిన తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ రైలు తల్వారీ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత రహీమ్ యార్‌ఖాన్ సమీపంలోని లియాఖత్ పూర్ ప్రాంతానికి చేరుకుంటున్న క్రమంలో ఈ దర్ఘటన సంభవించింది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 62 మంది సజీవ దహనం కాగా, అనేకులు 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలులోని వంటగదిలో అల్పాహారం తయారుచేస్తుండగా సిలిండర్లు పేలి ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం.

మంటలు ఏకంగా మూడు బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం భారీ స్థాయిలో సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రులలో 13 మంది పరిస్థితి విషమంగా వుందని అధికారులు తెలిపారు. అనేక మంది యాభై శాతానికి పైగా గాయాలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రైలులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంటలు రైలులోని ఇతర బోగీలకు వ్యాపించకుండా నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులతో పాటు స్థానికులు కూడా ప్రయాణికులను రక్షించేందుకు సహాయ చర్యల్లో పాల్గోంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles