ఒక స్వల్ప అంతిమ పరిష్కారానికై మన తెలంగాణ ప్రజా మానవాళి ఎదురుచూపులూ... Telangana People Still Last Hope on TSRTC

Telangana people still last hope on tsrtc

Telangana,TSRTC,TSRTC Strike

Telangana People Still Last Hope on TSRTC

ఒక స్వల్ప అంతిమ పరిష్కారానికై మన తెలంగాణ ప్రజా మానవాళి ఎదురుచూపులూ...

Posted: 10/26/2019 10:48 AM IST
Telangana people still last hope on tsrtc

(Image source from: ntnews.com)

ఆర్టీసీకార్మికుల సమ్మె 21 రోజులకు చేరుకుంది.. అటు సర్కార్  రాజ్యం  మరియు ఇటు కార్మిక  రాజ్యం  దిగకపోవడంతో ప్రజలే దిగి తమ తమ పనులను చేసుకుంటున్నారు.. బస్సుల పై ఆశలు విడచి తమ బతుకు సమాహారాన్ని సాగిస్తున్నారు..  ఆర్టీసీకార్మిక సమ్మె  దినాదినాభివృధి చెందుతూ ముందరకు కదలాడుతుంది..  ఐన పరిష్కారం లేని చిక్కు  ప్రశ్నలా  తిరుగాడుతుంది తప్ప ఒక  సరి  అయిన  ఆలోచనకు సమాధానం రావట్లేదు.. కార్మికుల సమ్మెలో భాగంగా ఈ నెల 30 నా బహిరంగ సభను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.సకల జనుల సమర భేరికి కార్మిక బృందాలు మొదలైపోతున్నాయి.. ఈ సమ్మెలో ఐన వారి వారి జీవితాలలో వెలుగులు నిలుస్తాయో లేదో మరలా నిరాశనే ఎదురవుతుందో వేచి చూడాల్సింది.. దసరా మొదలుకొని  నేటి దీపావళి పండగ వాతావరణం వారికి లేదు.. అంతగా కార్మిగా బృందం సమ్మెలో భాగమై పోయారు.

కార్మిక సంఘ ఐకాస ప్రతినిధులు అశ్వర్దమా రెడ్డి మొదలైన వారు అసెంబ్లీ నందు ఉన్న బట్టి విక్రమార్కను కలవడానికి తమ బాధను వెళ్లబుచ్చుకోవడానికి  వెళ్లగా  వారిని కలవనివ్వకుండా పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు.. ఇక చేసేది ఏమి లేక అయన ఇలా మాట్లాడారు హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీ  ముఖ ద్వారం నుండి కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసారు. ..ఇలా ఎన్ని ప్రయత్నాలు  గావించినా కార్మికులకు మాత్రం ఫలితం లభించడం లేదు..  అయినా ఆంధ్ర ప్రభుత్వం   ఆర్టీసీశాఖను తమ  ప్రభుత్వం లోనికి  విలీనం చేసింది..అలానే మన తెలంగాణ ప్రభుత్వాని కూడా చేయాల్సిందిగా  కోరింది..ఇదేమి పెద్ద కోర్కె కాకపోవొచ్చు కానీ కార్మిక సంఘాలను మాత్రం తీవ్ర ఒత్తిడికి లోను చేస్తున్న విషయం..

ఆర్టీసీకార్మికుల సమ్మెకు మద్దతుగా ఐక్యా  విదార్ది  ఆధ్వరంలో నిన్న శుక్రవారం నాడు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో బహిరంగ సభను నిర్వహించారు.. సభలో కోదండ రామిరెడ్డి గారు ఇలా అన్నారు మెట్రో రైలకు లయబిలిటీ ఫండ్ అందిస్తున్నా ప్రభుత్వం మన RTCకి  ఎందుకు  ఇవ్వట్లేదు అని ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికులు ఎన్నికల కోసం ఏమి సమ్మె  చెయ్యట్లేదు .తమ తమ జీవన ఆధారంకై  చేస్తున్నారు దీన్ని మన తెలంగాణ సర్కార్ గుర్తించి వీలైనంత త్వరగా ఒక  అంతిమ పరిష్కారంతో ఒక ముగింపు పలికి కార్మిక  సంఘాలను   ఆనంద   పరవశవీధుల్లో  నిలబెట్టాలని అభిలాష .. ఏనాడూ తీరెనో ఈ  సమ్మెలు వాటి  పరీక్షరాలు .. నెల  కావొస్తుంది అయినా సమస్య ఒక కొలిక్కి రావట్లేదు అంటే..  ఎం ఆలోచిస్తున్నారు..  ఎటు కదులుతుంది... మన ప్రజాస్వామ్య రాజ్యం... మన బంగారు తెలంగాణ.. ఆలోచనల ఉచ్చులో బిగిసుకుపోకుండా ఒక స్వల్ప అంతిమ పరిష్కార కారకానికై   మన తెలంగాణ ప్రజా మానవాళి ఎదురుచూపులూ.

శ్రీవల్లి... .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  TSRTC  TSRTC Strike  

Other Articles