ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్ధానం ఆయనకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం అరెస్టయిన రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్ లభించడం గమనార్హం. ఇతర కేసుల్లో అరెస్టు కాని పక్షంలో ఆయన్ని రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయవచ్చని కోర్టు తెలిపింది. వసరమైనప్పుడల్లా విచారణకు హాజరుకావాలని ఆయన్ను ఆదేశించింది. ఈ కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తే ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇదే కేసులో ఆయన ఈడీ కస్టడీలో ఉండటంతో చిదంబరం జైలులోనే గడపాల్సి ఉంది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో చిదంబరంను సీబీఐ ఆగస్ట్ 21న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంతో పాటు మరికొందరు ఉన్నతాధికారులపైనా సీబీఐ చార్జిషీట్ నమోదై.
(And get your daily news straight to your inbox)
Jan 18 | మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని... Read more
Jan 18 | కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా... Read more
Jan 12 | కరోనా మహమ్మారి విజృంభనతో గత మార్చి నుంచి నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఓవైపు ఉన్న ఉద్యోగాలే గాలిలో దీపాలుగా మారుతున్న క్రమంలో ఏ ఉద్యోగం దొరికినా ఫర్యాలేదని నిరుద్యోగ యువత భావిస్తున్నారు. కరోనా... Read more
Jan 12 | కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల ఉద్యమం ఊపందుకున్న వేళ.. ఎనమిది విడతలుగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపినా.. అడుగుముందుకు పడక,. ప్రతిష్టంభన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా,... Read more
Jan 12 | ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రిట్... Read more