foreigner creates ruckus on Indigo flight విమానంలో దుస్తులు విప్పేసి.. రచ్చ రచ్చ..

Swedish national creates ruckus on delhi hyderabad flight

Swedish national, Swedish national hyderabad, hyderabad, Swedish national, Delhi bound indigo flight, ruckus, indigo flight, emergency landing, RGIA police, CISF, Hyderabad, Crime

A Swedish national, who was flying to Delhi from Goa via Hyderabad, was detained at the airport on Saturday and has been shifted to a mental hospital after he created ruckus on-board an Indigo flight.

విమానంలో దుస్తులు విప్పేసి.. రచ్చ రచ్చ..

Posted: 10/12/2019 10:42 AM IST
Swedish national creates ruckus on delhi hyderabad flight

ఓ విదేశీయుడు చేసిన హంగామాతో ఢిల్లీ వెళ్తున్న ఓ ప్రైవేటు (ఇండిగో) విమానం అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. స్వీడన్‌కు చెందిన అలెగ్జాండ్రా (35) అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లేందుకు గోవాలో ఇండిగో విమానమెక్కాడు. ఆ తర్వాత కాసేపటికే అతడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తన సీటులోంచి లేచి దుస్తులు విప్పేసి విమానంలో అటూఇటూ తిరగడం మొదలుపెట్టాడు.

దీంతో విమానంలోని ఇతర ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. కొందరు భయాందోళనకు కూడా లోనయ్యారు. అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని దుస్తులు తొడిగేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం విఫలం కావడంతో వెంటనే శంషాబాద్ విమానాశ్రయానికి సమాచారం అందించారు. వారి అనుమతితో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం  అలెగ్జాండ్రాను సీఐఎస్‌ఎఫ్‌ అధికారులకు అప్పగించారు.

సీఐఎస్ఎఫ్ అధికారులు అతడిని రాజీవ్ గాంధీ విమానాశ్రయం పోలీసులకు అప్పగించారు. విదేశీ ప్రయాణికుడి మానసిక స్థితిపై అనుమానంతో పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అలెగ్జాండ్రా శరీరంపై ఎర్రటి మచ్చలు ఉండడంతో బహుశా అతడు డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మోతాదు ఎక్కువగా మాదకద్రవ్యాలను తీసుకున్న కారణంగానే అతను వింత ప్రవర్తనతో వ్యవహరించి వుండవచ్చని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swedish national  ruckus  indigo flight  emergency landing  RGIA police  CISF  Hyderabad  Crime  

Other Articles