TSRTC employees continue strike on 6th day ఆరవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

Tsrtc employees strike 6th day dussera holidays extended

TSRTC Workers gnore Govt warning, Maoist letter, maoist leader jagan, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Strong Warning To CM KCR, CM KCR, Warning To CM KCR, tsrtc workers strike, IAS committee tsrtc, face to face with tsrtc workers, tsrtc to merge in government, ts government

The indefinite strike by employees of TSRTC entered its sixth day as the KCR government refused to hold talk or even take back 48,000 striking employees issuing orders to recruit new employees and hire more private buses.

ఆరవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె: దసరా సెలవులు పొడగింపు

Posted: 10/10/2019 10:32 AM IST
Tsrtc employees strike 6th day dussera holidays extended

తమ న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని తెలంగాణలొ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరవ రోజుకు చేరుకుంది. ఓ వైపు ప్రభుత్వం ప్రస్తుతం అర్టీసీ సమ్మెలో పాల్గన్న కార్మికులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలన్న ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఇటు అర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు అందిన తరువాత తాము న్యాయపోరాటం చేయడానికైనా సిద్దమని కార్మిక సంఘాల నేతలు ఇప్పటికే తేల్చిచెబుతున్నారు.

ఇదే సమయంలో ఇటు రాష్ట్రంలోని విపక్షాలను కూడా కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్దం అవుతున్నాయి. సమ్మెకు మద్దతుగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలూ, ప్రజా సంఘాలూ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. సమ్మె ఉద్ధృతం చేసే క్రమంలో కార్యాచరణ రూపొందిస్తున్నారు. సమ్మెకు మద్దతుగా తెలంగాణ బంద్‌ నిర్వహించేందుకు అఖిలపక్ష నేతలు సమాలోచనలు చేస్తున్నారు.

దీనిపై హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది.  దీనిపైన ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతున్నది.  ప్రభుత్వం బెదిరించినా.. తలొగ్గేది లేదని ఆర్టీసీకి కార్మికులు స్పష్టం చేశారు.  అవసరమైతే తెలంగాణ బంద్ కు పిలుపునిస్తామని కార్మికులు చెప్తున్నారు.  దసరా ముందు నుంచి సమ్మె చేస్తుండటంతో.. ఇబ్బందులు పడుతూనే సొంత ఊర్లకు వెళ్లారు ప్రజలు.  కాగా, ఇప్పుడు తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రైవేట్ బస్సులు ఎక్కితే చార్జీలు మోతమోగుతున్నాయి.  రైల్వేలు కిటకిటలాడుతున్నాయి.  ఏం చేయాలో ఇలా తిరిగి రావాలో తెలియక పాపం ఇబ్బందులు పడుతున్నారు.  ప్రైవేట్ బస్సుల్లో చార్జీలు వసూలు చెయ్యొద్దని చెప్తున్నా.. యథేచ్ఛగా డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ యాజమాన్యాలు.  

సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో దసరా సెలవులను పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బస్సులు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, వివిధ పట్టణాలతో పాటు హైదరాబాద్ లో స్కూల్ బస్సులను లోకల్ సర్వీసులుగా తిప్పుతూ ఉండటంతో కనీసం రెండు రోజుల పాటు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై నేడు ఉత్తర్వులు వెలువడనున్నాయని ఓ అధికారి వెల్లడించారు. సమ్మె పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపించక పోవడం, కొత్త ఉద్యోగులను నియమించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తొంది. దీంతో ఈ నెల 15 వరకూ సెలవులను పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Srike  TS Employees  CM KCR  employees termination  RTC Unions  RTC workers  Telangana  

Other Articles