maoist leader Jagan letter to govt on tsrtc strike బెట్టువీడని కార్మిక సంఘాలు, ప్రభుత్వానికి మవోల లేఖ

Maoist leader jagan letter to govt on tsrtc strike

TSRTC Workers gnore Govt warning, Maoist letter, maoist leader jagan, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Strong Warning To CM KCR, CM KCR, Warning To CM KCR, tsrtc workers strike, IAS committee tsrtc, face to face with tsrtc workers, tsrtc to merge in government, ts government

As the Telangana State Road Transport Corporation (TSRTC) employees indefinite strike enters third day moaist leader Jagan writes a letter to CM KCR, stating that Telangana Government is responsible for TSRTC losses.

బెట్టువీడని కార్మిక సంఘాలు, ప్రభుత్వానికి మవోల లేఖ

Posted: 10/07/2019 03:43 PM IST
Maoist leader jagan letter to govt on tsrtc strike

తెలంగాణలొ ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో అర్టీసీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల నుంచి కూడా మద్దతు లభించింది. పండగ తరువాత టీఎస్ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తాము కూడా అంధోళనా కార్యక్రమాలను చేపడతామని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ కార్మికులకు నిషిద్ద మావోయిస్టుల నుంచి కూడా మద్దతు లభించింది. తమ న్యాయమన డిమాండ్లను సాధించుకునే క్రమంలో ఆర్టీసీ కార్మికులు మిలిటెంట్ మార్గంలో పోరాటాలు చేయాలని కూడా మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.

ఈ మేరకు టీఎస్ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతునిస్తూ మావోయిస్టు  పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ .. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సంస్ధకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతోనే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసమే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆయన విమర్శించారు.

మరోవైపు  ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మెను విరమించవద్దని, అవసరమైతే మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా ఆ సంస్థను నష్టాల నుంచి గట్టేక్కించే విధంగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వేలాది మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేలా చేస్తున్న సీఎం కేసీఆర్ తీరు మార్చుకోవాలని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా, ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న సుమారు 48 వేల మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆర్టీసీ కార్మికులు బ్లాక్ మెయిల్ విధానాన్ని అవలంభిస్తున్నారని సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సిబ్బంది వెంటనే విధులకు హాజరుకాకపోతే వారిని ఉద్యోగులుగా పరిగణించబోమంటూ ఆదివారం రాత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల తర్వాత కూడా కార్మికుల్లో మార్పు రాలేదు. దీంతో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకుంది.

కాగా అర్టీసీలోంచి ఏకంగా 48 వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ అదేశాలను సిద్దం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలను జారీ చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ విషయమై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వద్దామ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు భయపడే ప్రసక్తే లేదన్నారు. జీతాలివ్వకపోతే దిగొస్తారనుకోవడం ప్రభుత్వ అమాయకత్వమే అవుతుందన్నారు. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని అందరికీ తెలుసన్న ఆయన... ప్రజలకు కోపం సర్కారు మీదే.. కానీ. తమ మీద కాదన్నారు. సీఎం కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదన్న ఆయన.. కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు తీసివేయడానికి ఆర్టీసీ కార్మికులు.. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పనిచేసే పాలేరులం కాదన్నారు.

ఆర్టీసీ కార్మికులు మొక్కవోని ధైర్యం.. ఉద్యోగాలను తృణప్రాయంగా పెట్టి మరీ చేస్తున్న పోరాటాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం కూడా బెట్టు వీడటం లేదు. దీంతో ఇరువర్గాల బెట్టు కాస్తా ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో లాభాల బాట పట్టించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీ భవిష్యత్‌పై చర్చించేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. సునీల్ శర్మ నేతృత్వంలోని కమిటీ కార్యాచరణపై చర్చిస్తోంది. నష్టాలను అధిగమించడం.. అప్పులు తగ్గించుకోవడం.. ఆకుపెన్సీ పెంచడం వంటి కీలక అంశాలపై కమిటీ చర్చిస్తోంది.

ఇక మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అధికారులతో సీఎం కేసీఆర్ మరోసారి భేటీకానున్నారు. ఆర్టీసీని గాడినపెట్టడంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమ్మెలో ఉన్న కార్మికుల స్థానంలో కొత్త ఉద్యోగులను నియమించాలని సీఎం నిర్ణయించడం, దీనికి విధివిధానాలు ఎలా ఉండాలి? అనేదానిపై చర్చించనున్నారు.. ముఖ్యంగా ప్రైవేటీకరణ విషయంపై, ఉద్యోగ నియామకాలు, ఇతర అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇక, ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గకుండా సమ్మె కొనసాగిస్తుండడంతో.. కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Srike  TS Employees  CM KCR  Maoist letter  maoist leader jagan  RTC Unions  RTC workers  Telangana  

Other Articles