SBI stops circulating Rs 2,000 currency notes దసరా అలర్ట్: రూ.2 వేల నోట్ల పంఫిణీకి చెల్లు..!

Rbi s big decision 2000 rupee notes will not come out of atm

reserve bank of india, state bank of india, atm of sbi, 2000 rs note in sbi atm, RBI, SBI, RS 2000 note, currency notes, SBI ATMs, cassettes, no withdrawl of Rs 2000 notes, economy

State Bank of India (SBI), has essential news for people using ATMs. Now you will not be able to get 2000 rupee notes from SBI ATM. Large notes will gradually decrease in ATMs with SBI Bank.

దసరా అలర్ట్: ఏటీయంలలో ఇక రూ.2 వేల నోట్ల పంఫిణికి చెల్లు..!

Posted: 10/07/2019 02:31 PM IST
Rbi s big decision 2000 rupee notes will not come out of atm

యావత్ దేశ ప్రజలు విస్మయానికి గురయ్యే నిర్ణయాన్ని కేంద్రంలో బిజేపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకోబోతోందా.? అంటే ఔనన్న సంకేతాలే వినిపిస్తున్నాయి. దేశప్రజలు అటు చలికి గజగజలాడుతూ కూడా రాత్రింబవళ్లు క్యూలైన్లలో నిలబడి మరీ డబ్బులు విత్ డ్రా చేసుకున్న ఆ భాదకరమైన రోజులు గుర్తున్నాయా.? 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్లను రద్దు నిర్ణయం చేసిన తర్వాత అప్పటివరకు చెలామణిలో వున్న రూ.1000, రూ.500లను తొలగించారు.

అయితే పెద్ద నోట్ల రద్దు పేరుతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం హాస్యాస్పందంగా మారింది. కాగా, ప్రజలను ఏటీయం కేంద్రాల వద్ద, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చోబెట్టి వారి కష్టాలకు వారిని వదిలేసి.. తమ కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన రూ.2 వేల కరెన్సీ నోటుపై కానీ రూ.500 కరెన్సీ నోటుపై కానీ ఎలాంటి విమర్శలు రానీయకుండా చూసుకుందన్న విమర్శలు కూడా వినిపించాయి. అయితే వీటిని పట్టించుకునే స్థితిలో అప్పటి భారతీయ ప్రజలు లేకపోవడంతో..  ప్రభుత్వం చెలామణిలోకి తీసుకువచ్చిన రూ.2000 చిల్లర దొరికతే చాలునని ప్రజలు భావించారు. ఆ సమయంలో రూ.2వేల నోటుకు చిల్లర కూడా పెద్ద కష్టంగానే మారింది.

అయితే ఇప్పుడా విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారేగా.? భారత కెరెన్సీలోకి అడుగుపెట్టిన మూడేళ్లు కావస్తున్న ఈ అత్యంత పెద్ద నోటుకు ఇక కాలం చెల్లినట్లే అగుపిస్తోంది. తాజా పరిస్థితులు చూస్తే మాత్రం రూ.2 వేల నోటు కూడా బంద్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ నిలిచిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికీ ఈ నోటు సామాన్యల మనీపర్సుల నుంచి వెళ్లి.. ధనవంతుల ఉక్కు ఖాజాల్లో స్థిరపడిందని కూడా సమాచారం.

ఈ క్రమంలో ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) రూ.2 వేల నోటును నిలిపివేసింది. అంటే.. ఇక, ఎస్బీఐ ఏటీఎంల నుంచి రూ.2 వేల నోటు రాదని స్పష్టం అవుతోంది. అయితే ఈ బ్యాంకు నిర్ణయాలనే పలు ప్రైవేటు బ్యాంకులు కూడా తూచా తప్పకుండా ఫాలో అవుతున్న తరుణంలో అవి కూడా ఈ మేరకు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇలా మెజార్టీ బ్యాంకులు నిర్ణయాలను మైనారిటీ బ్యాంకులు కూడా ఫాలో అవ్వడం కామన్. ఫలితంగా దేశంలో ఎక్కడా ఏ ఏటీయంలో నుంచి కూడా రూ.2వేల నోటు రాకకు త్వరలోనే చెక్ పడనుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సూచనల మేరకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. ఇప్పటికే దాదాపు అన్ని ఎస్బీఐ ఏటీఎంల్లో రూ. 2 వేల నోట్లను ఉంచే క్యాసెట్లను తొలగించినట్టు సమాచారం. అంతేకాదు.. త్వరలోనే రూ.500 నోటును కూడా ఏటీఎంల్లో ఆపేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.. కేవలం రూ.200, రూ.100 నోట్లు మాత్రమే ఇక ఎస్బీఐ ఏటీఎంల ద్వారా పొందే వీలుంటుందన్నమాట. మరోవైపు ఏటీఎంల్లో చిన్ననోట్లు మాత్రమే లభ్యం కానుండడంతో.. ఏటీఎంల్లో ఫ్రీ లావాదేవీల పరిమితిని పెంచే యోచనలో కూడా బ్యాంకు ఉన్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  SBI  RS 2000 note  currency notes  SBI ATMs  cassettes  no withdrawl of Rs 2000 notes  economy  

Other Articles