Tirumala Srivaru on kalpavrusha vahanam తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహనంపై శ్రీవారు

Tirumala bramhostavam srivaru on kalpavrusha vahanam

tirumala,tirumala brahmotsavam, kalpavrusha vahanam, sarva bhoopala vahanam, chinna shesha vahanam, hamsa vahanam. tirumala tirupati devasthanams, tirumala srivari brahmotsavam 2019, srivari brahmotsavam 2019, tirumala srivari brahmotsavam, brahmotsavam, srivari brahmotsavam, tirumala brahmotsavam 2019

Tirumala Sri vari Brahmotsavam celebrations are being conduted on the fourth day, as a part of brahmotsavam srivaru paraded kalpavrusha vahanam in the tirumada streets.

తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహనంపై శ్రీవారి ఊరేగింపు

Posted: 10/03/2019 10:17 AM IST
Tirumala bramhostavam srivaru on kalpavrusha vahanam

అఖిలాండకోటి బ్రహ్మోడనాయకునిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిట కొంగుబంగారమైన.. అల శ్రీనివాసుడికి ఇల వైకుంఠమైన  తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమందు అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల కన్నుల పండువగా సాగుతున్నాయి. నాల్గవ రోజును పురస్కరించుకుని దేవదేవుని ఇవాళ ఉదయం కల్పవృక్ష వాహన సేవను నిర్వహించారు. కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించని మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగితూ మాడ వీధుల్లో స్వామి దర్శనం కోసం వేచివున్న అశేష భక్తజన కోటికి అభయప్రధానం చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్త జనసందోహం పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరకుంటున్నారు. దీంతో తిరుమల క్షేత్రం  గోవిందనామ స్మరణతో  మారుమోగుతోంది. కల్పవృక్ష వాహనంపై ఊరేగే మలయప్ప స్వామిని దర్శించుకుంటే తమ ఇంటి లేమి అన్న శబ్దము వుండదని భక్తుల విశ్వాసం. కల్పవృక్షం కోరినవారికి మాత్రమే వరాలిస్తే, తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే వేల్పు గోవిందుడు.

అమృతాన్ని ఆపేక్షించి సురులు, అసురులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని క్షీరసాగరమథనం సాగించగా, విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో ఈ కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరినవారికి ఆకలిదప్పులుండవు. అంతేకాదు పూర్వజన్మ స్ఫురణ కూడా కలుగుతుంది. తనను శరణు జొచ్చిన భక్తులకు కోరికలను నెరవేరుస్తానని చెప్పడానికే కల్పవృక్ష వాహనంపై ఊరేగుతారు.

బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు రాత్రి ఏడడుగుల ఎత్తు, పూర్తిగా బంగారు రేకులతో నిర్మించిన సర్వభూపాల వాహనంలో స్వామి విహరిస్తారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే భగవత్సేవాపరులై ఉండాలి. లోకంలోని భూపాలకులందరికీ రారాజు తానేనని స్వామి చాటుతూ సర్వభూపాల వాహనంపై భగవంతుడు ఊరేగుతారు. సర్వభూపాల వాహన వాహన సేవను దర్శిస్తే, భక్తకోటికి రాజ్యసుఖ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles