ప్రజలు అరోగ్యంగా వుంటేనే రాష్ట్రం అరోగ్యంగా వుంటుందన్న సత్యాన్ని రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. తొలి పర్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం రెండో పర్యాయంలో మాత్రం ఏకంగా ప్రజలు అరోగ్యంపై దృష్టిని కేంద్రీకరించింది, చిన్నపాటి అనారోగ్యంతోనో లేక జ్వరంతో హాస్పిటల్ కు వెళ్లినా కేవలం ల్యాబ్ పరీక్షలకే వేలల్లో డబ్బు ఖర్చువుతున్న క్రమంలో వారికి ఊరట కల్పిస్తూ దసరా పండగ వేళ తియ్యని కబురును కానుకగా అందించింది.
అసుపత్రులకు వెళ్లితే చాలు పరీక్షలకు డబ్బులు నీళ్లలా ఖర్చయిపోతుయని గ్రహించి.. పేదలపై ఈ భారం పడకుండా ఊరటను కల్పించింది. పేదలకు మొత్తం 58 రకాల పరీక్షల్ని పూర్తి ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బ్లడ్ టెస్ట్, మల, మూత్ర పరీక్షలు, టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణ టెస్ట్ లతో పాటు లివర్, కిడ్నీలు, థైరాయిడ్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి మొత్తం 58 రకాల పరీక్షలు పూర్తి ఉచితంగా చేసేందుకు చర్యలు తీసుకుంది.
ప్రతీ జిల్లా ఒక డయాగ్నస్టిక్ హబ్
ఉచితంగా వైద్య సేవలు ఎక్కడ చేస్తారు.? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయా.? ఈ సదుపాయం అన్ని జిల్లాల్లోని ప్రభుత్వం హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకొచ్చిందీ ప్రభుత్వం. రాష్ట్రంలోని జిల్లాకేంద్రాల్లో వున్న ప్రభుత్వాసుపత్రులలో ల్యబ్ టెస్టులను ఉచితంగా నిర్వహిస్తున్నారు. రోగనిర్ధారణ పరీక్షలకు గతంలో ప్రత్యేకంగా బడ్జెట్ అంటూ ఉండేది కాదు. కానీ సీఎం కేసీఆర్ పాలన ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడంతో రోగ నిర్థారణ పరీక్షలు ప్రజలకు ఉచితంగా జరుగనున్నాయి.
ఇక దీంతో పాటు ప్రతీ జిల్లాల్లోను డయాగ్నస్టిక్ హబ్ నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లోను డయగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటు..వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. దాంతో డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణకు టీఎస్ఎంఎస్ఐడీసీలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి.. ప్రజలకు ఈ సేవలు అందేలా చర్యలు తీసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more