Kodela statue base dismantled in lingaraopeta కోడెల శివప్రసాద్ విగ్రహ దిమ్మె కూల్చివేత

Former speaker kodela statue base dismantled in yadlapadu lingaraopeta

Kodela siva prasad rao statue, kodela statue lingaraopeta dismantled, TDP leaders kodela statue, Kodela statue diary farm, kodela statue yadlapadu, former speaker, TDP leaders, Statue, Lingaraopeta, dismantled, Andhra Pradesh, politics

TDP leaders of yadlapadu lingaraopeta were in arrangements to inaugurate the statue ot former Speaker Kodela Siva Prasad Rao who had passed away last month. The officials in the last minute dismantled the base stating the the statue has no permission.

కోడెల శివప్రసాద్ విగ్రహ దిమ్మె కూల్చివేత

Posted: 09/30/2019 12:34 PM IST
Former speaker kodela statue base dismantled in yadlapadu lingaraopeta

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనయర్ నేత కోడెల శివప్రసాద్ రావు విగ్రహ ఏర్పాటులో వివాదం నెలకొంది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించాలని టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికోసం టీడీపీ శ్రేణులు ఆ ప్రాంతలో దిమ్మెను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కోడెల విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ చివరి నిమిషంలో అధికారులు టీడీపీ నేతలకు షాక్ ఇచ్చారు. దీంతో లింగరావుపాలెంలో టెన్షన్ నెలకొంది.

కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని టీడీపీ నేతలు తేల్చిచెప్పగా, అసలు ఆయన విగ్రహ ఏర్పాటు చేసే క్రమంలో అనుమతులు తీసుకోలేదని, దీంతో విగ్రహ ఏర్పాటును అనమతించేది లేదని అధికారులు భ్మీషించడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం అలుముకుంది. ఈ నేపథ్యంలో పంచాయితీ అధికారులు పిర్యాదు మేరకు ఇవాళ తెల్లవారు జామునే రంగంలోకి దిగిన పోలీసులు.. అధికారుల ఘటనాస్థలానికి చేరుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య విగ్రహ దిమ్మెను ధ్వంసం చేశారు.

కాగా, విగ్రహ దిమ్మె కూల్చివేత సమయంలో ఇరు వర్గాలకు మధ్య కొంత వాగ్వాధం చోటుచేసుకుంది. దీంతో కొంత సమయం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి, అయితే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మరణించిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని టీడీపీ నాయకులు అరోపిస్తున్నారు. కొడెల విగ్రహం ఏర్పాటు నిమిత్తమై వారం క్రితమే కలెక్టర్ అనుమతి కోరామని తెలిపారు.

కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపే కారణమని విగ్రహ ఏర్పాటు విషయంలో మరోమారు రుజువైందని వారు దుయ్యబట్టారు. దివంగత సీఎం వైఎస్ విషయంలో విమర్శలు వస్తే మరణించిన మనిషిపైనా బురదజల్లుతున్నారన్న సీఎం.. ఇప్పుడు కోడెల విషయంలోనూ అదే బురదను ఎందుకు జల్లుతున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారులతో పాటు పోలీసుల చర్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodela shiv prasad  former speaker  TDP leaders  Statue  Lingaraopeta  dismantled  Andhra Pradesh  politics  

Other Articles