Pawan Kalyan sensational comments on farmer death అన్నదాత మరణంపై జనసేన ఆవేదన..

Pawan kalyan sensational comments on farmer death

Janasena, Pawan Kalyan, siddipet, Urea, farmers, queue, dubbaka, Yellaiah, heart stroke, Telangana, politics

Jana Sena party President Pawan Kalyan becomes panic on farmer death, who was standing in queue to collect urea. The power star also suggests ministers to speak out on this issue in a good manner, rather quoting it as just a coincidence.

అన్నదాత మరణంపై జనసేన ఆవేదన.. మంత్రులకు సూచన..

Posted: 09/06/2019 04:44 PM IST
Pawan kalyan sensational comments on farmer death

తెలంగాణలో అన్నదాతకు అండగా నిలుస్తామని ప్రభుత్వం చెబతున్న మాటల్లో నిజమెంత వుందో.? తెలియదు కానీ రైతుల మరణాలు మాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అన్నదాతలకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామని చెప్పుకునే ప్రభుత్వ హయాంలోనే వారి మరణాలు సంబవిస్తున్నాయి. ఈ విషయమై విపక్షాలు ఇప్పటికే కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. సిద్దపేటను మోడల్ నియోజకవర్గంగా చెప్పుకునే సీఎం.. అక్కడే రైతు మరణం సంభవించడంతో పరిస్థితులు ఎలా వున్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క సూచించారు.

తాజాగా ఈ ఘటనపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. యూరియా కోసం క్యూలైన్లో నిలబడి రైతు చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి మాట్లాడిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటనపై పదవిలో ఉన్న వాళ్లు సరైన రీతిలో స్పందించాలని ఆయన కోరారు. కాకతాళీయంగా జరిగిన ఘటనగా పేర్కొనడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

రైతులకు ఎంత మేరకు విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయో అంచనా వేసి డిమాండ్ తగ్గ విధంగా సరఫరా చేయడం ప్రభుత్వ బాధ్యత అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం యుద్ధప్రాదిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడి చనిపోయిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan Kalyan  siddipet  Urea  farmers  queue  dubbaka  Yellaiah  heart stroke  Telangana  politics  

Other Articles