JC sensational comments on YS Jagan 100 days rule జగన్ ప్రభుత్వంపై జేసీ సంచలన వ్యాఖ్యలు

Jc diwarkar reddy sensational comments on ys jagan 100 days rule

JC sensational comments on AP Government, JC sensational comments on YSRCP Government, JC Diwakar Reddy sensational comments on Jagan Government, JC Diwakar Reddy, YS Jagan, YSRCP, TDP, Ananthapur, YS Jagan Government, Andhra Pradesh, Politics

TDP Senior Leader, former MP JC Diwarkar Reddy made sensational comments on YS Jagan Government on completing 100 days rule.

ITEMVIDEOS: వైఎస్ జగన్ ప్రభుత్వంపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Posted: 09/06/2019 03:54 PM IST
Jc diwarkar reddy sensational comments on ys jagan 100 days rule

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనదైన స్టైల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అనుభవాన్నంతా రంగరించి.. కర్ర విరగొద్దు.. పాము చావద్దు అన్న చందంగా  రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శతదినోత్సవాన్ని పూర్తి చేసుకున్న క్రమంలో వైఎస్సార్ సిపీ ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేశారాయన. వందకు వంద మార్క్‌లు పడాల్సిందేనని అన్న ఆయన.. మరీ మాట్లాడితే వందకు 110 మార్కులు వేయాల్సిందేనన్నారు.

దీంతో ఇప్పటికే టీడీపీకి హ్యండిస్తున్న నేతల సంఖ్య పెరుగుతున్న క్రమంలో తాజాగా తోట త్రిమూర్తులు కూడా షాక్ ఇచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సీనియర్ నేత జేసీ కూడా రమారమి అలాంటి వ్యాఖ్యలు చేయడం, టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ప్రభుత్వంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. జగన్ ఎప్పుడూ తమవాడేననిన్నారు. అయితే, జగన్‌ను చేయిపట్టుకొని నడింపించేవాడు కావాలన్న జేసీ... సలహాలు ఇవ్వాలని అడిగితే చూస్తామని చెప్పారు. దీంతో వైసీపీ నుంచి పిలుపు కోసం జేసీ నిరీక్షిస్తున్నారా.? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

మరోవైపు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా అదే స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. తాజాగా ఆర్టీసీని విలీనం చేయడం వల్ల ప్రభుత్వంపై చాలా భారం పడుతోందని.. విలీనంతో కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదన్నారు. జగన్ కింద పడుతూ.. లేస్తూ వెళ్తున్నాడన్న జేసీ.. ఆయన అడిగితే మాత్రమే సలహాలు ఇస్తానని అన్నారు.  ఇక అధికార మార్పిడి జరిగిన తరుణంలో ఎవరు అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వం హయంలో జరిగిన పనులపై దృష్టి పెడతారన్న ఆయన.. మైక్రో స్కోప్‌తో చూడాలి తప్ప.. పగలగొట్టి చూస్తే ఎలా? అని జేసీ నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC Diwakar Reddy  YS Jagan  YSRCP  TDP  Ananthapur  YS Jagan Government  Andhra Pradesh  Politics  

Other Articles