Cab driver loots NRI passenger in Hyderabad ఎన్ఆర్ఐ ప్రయాణికుడ్ని దొచేసిన క్యాబ్ డ్రైవర్..

Cab driver assaults passenger in hyderabad flees with booty and gold

NRI robbed by cab driver, NRI robbed by taxi driver, Cab Driver, Shamshabad airport, foreign currency, Gold, United Kingdom, London, Dammaiguda, Rachakonda Police, Telangana, Crime

A NRI passenger who booked a private cab from Shamshabad Rajiv Gandhi International Airport (RGIA) to his residence in Dammaiguda has been assaulted and robbed by the cab driver.

ఎన్ఆర్ఐ ప్రయాణికుడ్ని దొచేసిన హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్..

Posted: 09/04/2019 01:27 PM IST
Cab driver assaults passenger in hyderabad flees with booty and gold

హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయంగా చక్కని గుర్తింపును తెచ్చుకుంటోందని సంబరపడుతున్న క్రమంలోనే అంతకుమించిన నేరగాళ్లు కొత్త పంథాలతో నేరాలకు పాల్పడటంతో సంబరం అవిరైపోతుంది. తాజాగా శంషాబాద్ లో జరిగిన ఘటన ఇలాంటిదే. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి.. తన స్వగ్రామానికి తిరిగివస్తున్న ఓ ప్రయాణికుడిపై క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. తన కారులో ఎక్కిన ప్రయాణికుడు స్వదేశానికి చేరుకుంటున్నాన్న అలోచనలో నిమగ్నం కాగానే.. అతడి దారిమళ్లించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేసి.. అతని వద్దనున్న డబ్బు(యూకే కరెన్సీ), బంగారం లాక్కుని పారిపోయాడు.

2015 ఆ మధ్యకాలంలో కొందరు హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు చేసిన ఘటనలతో వారంటేనే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఇలాంటి ఘటనలు వారిపై ఉన్న నమ్మకాన్ని కూడా పొగొట్టేలావున్నాయి. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్వగ్రామానికి క్యాబ్ లో వస్తుండగా ఈ ఘటన జరిగింది. తన పెళ్లి నిమిత్తం యునైటెడ్ కింగ్ డమ్ నుంచి కొంగ్రోత్త ఆశలతో, ఆలోచనలో హైదరాబాద్ లో అడుగుపెట్టిన ప్రయాణికుడిని.. బాధితుడిలా మార్చేశాడు క్యాబ్ డ్రైవర్. అతనిపై దాడి చేసి.. బంగారం 2 లక్షల యూకే కరెన్సీని తీసుకుని ఉడాయించాడు.

బాధితుడు ప్రవీణ్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. తాను గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్నానని.. తానున్న ప్రదేశంలో కొండపై గుడి ఉన్నట్లు వెల్లడించాడు. వెంటనే బాధితుడి బందువులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి స్వగ్రామం దమ్మాయిగూడ. 15 రోజుల్లో తన వివాహం ఉండటంతో బాధితుడు యూకే నుంచి ఇండియాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్యాబ్ డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన సంచలనం రేపింది. చాలామంది నగరవాసులు క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. ఓలా, ఉబెర్ క్యాబుల్లో జర్నీ చేస్తున్నారు. ఈ ఉదంతంతో వారంతా హడలిపోతున్నారు. సేఫ్ గా ఉంటుందని భావించిన క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. అలాంటిది క్యాబ్ డ్రైవరే దారుణానికి ఒడిగట్టడం షాక్ కు గురి చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles